మళ్లీ ఢిల్లీకి కేసీఆర్ ! ఎందుకంటే ? 

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు.కొద్దిరోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Telangana Cm Kcr Delhi Tour Fixedtelangana Cm,kcr,ktr, Kcr Delhi Tour, Central H-TeluguStop.com

అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మిగతా కేంద్ర మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.వివిధ అంశాలపై చర్చించారు.

అయితే తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు , ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న సమయంలో కెసిఆర్ ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా మెలగడం వంటివి తెలంగాణలో బీజేపీ ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి.

  ఇదిలా ఉంటే మరో సారి కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

శనివారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ,  ఒడిశా,  ఛత్తీస్ ఘడ్,  జార్ఖండ్ , మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్ , బీహార్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అభివృద్ధి పనుల పైన చర్చించబోతున్నారు.
   

Telugu Chattisgarh, Kcr Delhi, Modhi, Prime, Smith Sha, Telangana, Telangana Cm-

  ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే కెసిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసులు ఆర్అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు అందించేందుకు  ఫైలు సిద్ధం చేసుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సమావేశం ముగిసిన అనంతరం కెసిఆర్ కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అదే జరిగితే బిజెపి కి మరిన్ని ఇబ్బందులు వచ్చి పడినట్టే.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube