ఈ టైంలో కరోనా లేకుంటే డాన్స్‌ చేసేవాడిని

రాష్ట్రంలో కరోనా విపత్తు నేపథ్యంలో నిన్న సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన విషయం తెల్సిందే.కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ఎత్తివేసే విషయమై ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ సమయంలో లాక్‌ డౌన్‌ను ఎత్తివేయడం మంచిది కాదని అన్నారు.

 Telanagan Cm Kcr Dance While Corona Not Spread In Telangana, Telanagana, Kcr, Gu-TeluguStop.com

ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది.ఇలాంటి సమయంలో కరోనా విపత్తు రావడం చాలా బాధకరం అంటూ విచారం వ్యక్తం చేశాడు.

భారీ ఎత్తున వరి దిగుబడి వస్తున్న నేపథ్యంలో వరి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు.అయితే ప్రస్తుతం వరి కొనుగోలు కోసం గన్నీ బ్యాక్స్‌ కొరత ఉందని అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

పశ్చిమబెంగల్‌ నుండి భారీ ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇదే సమయంలో తెలంగాణలో కూడా గన్నీ బ్యాగ్స్‌ తయారీకి పరిశ్రమలు నెలకొల్పేందుకు వ్యాపారస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

గతంలో ఎప్పుడు లేనంతగా వరి ధాన్యం తెలంగాణలో ఈసారి పండినది.ఈ విపత్తు లేకుంటే నేను పండిన పంటను చూసి డాన్స్‌ చేసే వాడిని అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube