జగన్ బాటపట్టిన కేసీఆర్ ?  

KCR Following Jagan, YS Jagan, Telangana CM KCR, TRS Govt, Corona tests, coronavirus diagnostic tests -

రాజకీయ చాణిక్యుడిగా పేరు పొందిన తెలంగాణ సీఎం కేసీఆర్, రాజకీయంగా ఒత్తిడికి గురి కాకుండా, తాను అనుకున్న పనులు అనుకున్నట్టుగా అమలు చేస్తూ, ముందుకు వెళుతూ ఉంటారు.తన రాజకీయ ప్రత్యర్ధులకు విమర్శించే అవకాశం లేకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

 Telangana Cm Kcr Coronavirus Diagnostic Tests

టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వ్యవహార శైలి ఈ విధంగానే ఉంటూ వస్తోంది.మొదట్లో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉన్నా, ఆకస్మాత్తుగా పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకోవడంలో కేసీఆర్ పైచేయి సాధిస్తూ వస్తున్నారు.

అలాగే కరోనా వైరస్ విషయంలోనూ, కేసీఆర్ ఇదేవిధంగా వ్యవహరించి అందరితోనూ మొదట్లో ప్రసంశలు అందుకున్నారు.ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో ఉన్న సమయంలో కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించి నిత్యం అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజలను రోడ్లపైకిఈ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

జగన్ బాటపట్టిన కేసీఆర్ -Political-Telugu Tollywood Photo Image

అప్పట్లో కేసిఆర్ ముందుచూపుతో వ్యవహరించడంతో, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిస్థితి అదుపులో ఉన్నట్టు కనిపించింది.ఇక ఆ తరువాత లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం, తెలంగాణలో వైరస్ మహమ్మారి ప్రమాదకర స్థాయిలో విజృంభించడం వంటి కారణాలతో పాటు, కేసీఆర్ ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాజిటివ్ సోకిన వారి వివరాలను దాచి పెడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించకుండా, కేసుల సంఖ్య తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ఆ విమర్శలకు సమాధానం చెప్పకుండా, కేసీఆర్ కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం, ఇలా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రజా ఆగ్రహం కూడా ఎదుర్కొంటూ వస్తుండడం, ఈ వ్యవహారం ముందు ముందు ఇబ్బంది తెచ్చే విధంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీలో ఏ విధంగా అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించడం, పాజిటివ్ సోకినా వారిని చికిత్సకు తరలిస్తూ, వారు కోలుకునే విధంగా వైద్యం అందించడం, ఇలా దేశవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ విధంగానే ఇప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయిస్తున్నారు.మొన్నటి వరకు తెలంగాణలో ఐసీఎంఆర్ సూచించిన ఆర్టి పిసిఆర్ పద్ధతిలో కోవిడ్ 19 పరీక్షలు చేస్తూ వచ్చారు.

ఈ వ్యవహారం బాగా ఖర్చుతో కూడుకొవడంతో పాటు, వ్యాధి నిర్ధారణ అవ్వడానికి చాలా రోజులు సమయం పడుతుండటంతో, ఏపీలో నిర్వహిస్తున్నట్లుగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది.

కరోనా విషయంలో పోయిన ప్రతిష్టను కొద్దిరోజుల్లోనే తిరిగి తెచ్చుకుని ప్రజలతో ప్రశంసలు అందుకునే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది.దీనిద్వారా విపక్షాల నోళ్లు మూతపడేలా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Cm Kcr Coronavirus Diagnostic Tests Related Telugu News,Photos/Pics,Images..