కరోనా నిరోధానికి కేసీఆర్ ఇన్ని చేస్తున్నాడా ?

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ వైరస్ ఇప్పటికే సోకిన వారి నుంచి మరెవ్వరికీ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

 Kcr Do The So Many Activities For Corona Virus Break, Telangana Cm Kcr, Corona-TeluguStop.com

ఈ విషయంలో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది.తెలంగాణ లో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు పెరుగుతుండడంతో పగడ్భందిగా చర్యలు తీసుకుంటున్నారు.

అసలు తెలంగాణాలో కరోనా ప్రభావం మరింతగా పెరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ ప్రకటిస్తున్నారు.ఈ మేరకు కరోనా ప్రభావం, లాక్ డౌన్ పరిస్థితి, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రగతిభావం లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాకు పలు విషయాలు వివరించారు.రాష్ట్రంలో 60 వేల మంది కరోనా బారిన పడ్డా వారికి చికిత్స అందించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కేసీఆర్ వెల్లడించారు.

Telugu Corna Telangana, India Lock, Telangana Trs-Political

తెలంగాణాలో కేసీఆర్ ప్రభావం ఎక్కువగానే ఉందని, శుక్రవారం ఒక్క రోజే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేసీఆర్ వివరించారు.అసలు రాష్ట్రం మొత్తం మీద 20 వేల మంది క్వారంటైన్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, సీఎం కేసీఆర్ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణాలోనూ, ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని, రాత్రి వేళల్లో కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.ప్రజలందరూ లాక్‌డౌన్‌కు తప్పనిసరిగా సహకరించాలని నిర్లక్ష్యంగా బయట తిరగొద్దని కేసీఆర్ సూచించారు.

ప్రభుత్వాల మాట వినకపోవడం వల్ల అమెరికా ఇప్పుడు చాలా బాధపడుతోందన్నారు.న్యూయ్యార్క్ సిటీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడమే కాకుండా మరణాలు ఎక్కువ అవుతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.

Telugu Corna Telangana, India Lock, Telangana Trs-Political

ఇక కేంద్రం కూడా కరోనా విషయంలో తెలంగాణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కేసీఆర్ వెల్లడించారు.రాష్ట్రంలో1400 ఐసీయూలు, 12,400 పడకలు సిద్దం చేసినట్లు కేసీఆర్ చెప్పారు.మరో 500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు.ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ కేంద్రాన్ని సిద్దం చేసినట్టుగా కేసీఆర్ వెల్లడించారు.11 వేల మంది రిటైర్డ్ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు.రోగ నిర్థారణకు ప్రభుత్వ ల్యాబ్స్ సరిపోకపోతే ప్రైవేటు ల్యాబ్స్‌ను కూడా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube