కెసీఆర్ పెద్ద మనసు

సాధారణంగా పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళతోనే కలుస్తారు తప్ప చిన్న వాళ్ళతో కలవరు.పెద్ద వాళ్ళంటే వయసు రీత్యా పెద్ద వాళ్ళు కాదు.

 Kcr Attends His Car Driver’s Daughter’s Wedding-TeluguStop.com

డబ్బు, అధికారం, పదవి .ఈ విధమైన పెద్దవాళ్ళు.వీళ్ళు తమతో సమానమైన వారి ఇళ్ళలో జరిగే శుభ కార్యాలకు లేదా పెద్ద అధికారుల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు వెళతారు తప్ప నాలుగో తరగతి ఉద్యోగుల ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు వెళ్లారు.అందరూ ఇలాగే ఉంటారని కాదు.

సాధారణంగా స్వభావం ఇలాగే ఉంటుంది.తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ తన కారు డ్రైవర్ కూతురి పెళ్ళికి హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు.

ఈ మధ్య ఒక కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వచ్చారు.అంత పెద్దాయన వస్తేనే కెసీఆర్ హాజరు కాకుండా ఫామ్ హౌజ్ లో పడుకున్నారు.

కానీ డ్రైవరు కూతురు పెళ్ళికి హాజరై పెద్ద మనసు చాటుకున్నారు.సీఎమ్ అంతటి వ్యక్తీ వచ్చారంటే ఆ డ్రైవరు కుటుంబానికి పట్ట పగ్గాలు ఉంటాయా? తరతరాలకు ఈ విషయం చెప్పుకుంటారు.కెసీఆర్ ఒక్కరే పెళ్ళికి వెళ్ళలేదు.వెంట సతీమణి కూడా ఉన్నారు.కెసీఆర్ దంపతులు ముహూర్తానికి పది నిమిషాల ముందే కళ్యాణ మండపానికి చేరుకున్నారు.డ్రైవరు బాలయ్య గత 20 ఏళ్ళుగా కెసీఆర్ దగ్గర పని చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube