కేసీఆర్ జగన్ ఇద్దరూ ఇద్దరే ? అదే కదా బాబుకి కలిసొచ్చేది ?  

Telangana Cm Kcr Ap Cm Jagan Kcr Press Meet Jagan Press Meet - Telugu Ap Cm Jagan, Ap State Election Comissioner Ramesh Kumar, Jagan Press Meet, Kcr And Jagan, Kcr Press Meet, Tdp Chandrababu Naidu, Telangana Cm Kcr

మీడియా మేనేజ్మెంట్ చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి సమర్ధుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతికూల అంశాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడంలో బాబు బాగా ఆరితేరిపోయారు.

 Telangana Cm Kcr Ap Cm Jagan Kcr Press Meet Jagan Press Meet

అందుకే మీడియా మేనేజ్మెంట్ అనే పదం వినగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు చంద్రబాబు.మీడియాను తనకు అనుకూలంగా వాడుకుని రాజకీయ లబ్ది పొందడంలో చంద్రబాబు సక్సెస్ అవుతూ వస్తున్నారు.

దానికి తగ్గట్టుగానే మీడియాకు ఆయన తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ విషయంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా వెనుకబడి పోయారు.

కేసీఆర్ జగన్ ఇద్దరూ ఇద్దరే అదే కదా బాబుకి కలిసొచ్చేది -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అసలు మీడియా అంటేనే ఆమడ దూరం పరిగెట్టే పరిస్థితి.అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా సమావేశాలు నిర్వహించేందుకు అటు కేసీఆర్ గాని, జగన్ కు గాని ఇష్టపడడం లేదు.

తమ పార్టీ నాయకులు కూడా మీడియా సమావేశాలకు, టీవీ డిబేట్లకు వెళ్లకండా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడో అడ్డుకట్ట వేశారు.

తెలంగాణ సీఎం కానీ, ఏపీ సీఎం కానీ, ఎప్పుడైనా మీడియా సమావేశం నిర్వహిస్తే తాము చెప్పాలనుకున్న విషయం తప్ప ఏ విషయం గురించి వారు మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

అసలు మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను వినేందుకు కూడా ఆసక్తి చూపించరు.తాము చెప్పింది వినడం తప్ప మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మాకు రాలేదు అన్నట్టుగా ఈ ఇద్దరి మిత్రుల వ్యవహారం ఉంటుంది.

జగన్ విషయాన్ని చూసుకుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మీడియా సమావేశం నిర్వహించింది.రెండుసార్లే.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిరన్యం తీసుకోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వైసిపి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఈ విషయంపై రమేష్ కుమార్ చేసిన పనిని తప్పుపడుతూ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జగన్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా జగన్ లేచి వెళ్ళి పోయారు.మీకు ఏ వివరాలు ఏమైనా కావాల్సి వచ్చినా మా పార్టీ నాయకులను సంప్రదించాలంటూ జగన్ సంధానం చెప్పారు.

ఇక తెలంగాణ సీఎం కెసిఆర్ అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే తప్ప ఏవైనా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఉంటే కనుక ఆ సమావేశంలోనే ఆ ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులను తిట్టి పోస్తూ ఉంటారు.అయితే జగన్, కెసిఆర్ ఈ విధంగా వ్యవహరించడం వెనుక కారణాలు విశ్లేషిస్తే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉంటే తాము జనాల్లో అలుసయిపోతాము అని భావించే మీడియాను దూరంగా పెడుతూ తమకు అవసరమైన సమయంలో తాము చెప్పాలనుకున్న విషయం వరకు మాత్రమే మీడియాను ఉపయోగించుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..