కేసీర్ పై కూతురు సంచలన వ్యాఖ్యలు   Telangana CM Is Fond Of Cinema Says Ramya!     2018-03-03   05:02:33  IST  Bhanu C

కల్వకుంట్ల రమ్య పేరు విన్నారా? ఆమె తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు గారి సోదరుడి కుమార్తె. ఈమె కాంగ్రెస్ పార్టీ లో ఒక నాయకురాలు. ఆమె ఇటీవల ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కేసీఆర్ పై చేసిన విమర్శలు అందరిని షాక్ కి గురిచేశాయి.

తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న గొంగళి పురుగును సైతం ముద్దుపెట్టుకుంటానని కేసీఆర్ ప్రగాల్బాలు పలికారంటు, తాను-తన భర్త కూడా తెలంగాణా ఉద్యమంలో తమ పాత్రలని ఎంతో చురుకుగా పోషించినా తన భర్తకి కీసీఆర్ అంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తన భర్త చావు బ్రతుకుల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ కనీసం పలకరించలేదంటు ఆమె వాపోయింది. పొన్నాల లక్ష్మయ్యగారు సీఎం రిలీఫ్ ఫండ్ కు లెటర్ పెట్టినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యక్తి….తెలంగాణ ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తారని రమ్య ప్రశ్నించారు.

అయితే కేసీఆర్ కి సంబంధించి ఎంతో ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆమె పంచుకున్నారు. కేసీఆర్ కి సినిమా రంగంపై మక్కువ ఎక్కువంటూ, చదువుకొనే రోజుల్లోనే అయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారని ఆమె తెలిపారు. అయితే మరి నాటకాల్లో, నటించార లేదా అన్న విషయం తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఆ కాలంలోనే దుబాయ్- గల్ఫ్ కంట్రీస్ కి చదుకోడానికి, ఉద్యోగం కోసం వెళ్ళే వారికోసం అయన ఒక కన్సల్టెన్సీ లా పనిచేశారని ఆమె ఈ సందర్బంలో తెలిపారు.