బాలుడికి సంకెళ్ళు..పోలీస్ బాస్ కి నోటీసులు..

ఈ పనికి మాలిన పని ఎందుకు చేశారో చెప్పండి అంటూ తెలంగాణ బాలల హక్కుల సంస్థ మెదక్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంటుకు నోటీసు జారీ చేసింది.ఏం జరిగింది? మైనర్‌ బాలుడి (పద్నాలుగేళ్లు) చేతికి పోలీసులు సంకెళ్లు వేసి బస్సులో తీసుకెళుతున్న ఫొటో, వీడియో మీడియాలో వచ్చాయి.దీంతో దుమారం రేగింది.బాల నేరస్తులకు సంకెళ్లు వేయకూడదు.వారి ఫొటోలు, వీడియోలు మీడియాలో చూపించకూడదు.వారి పేర్లు రాయకూడదు.

 Telangana Child Rights Body Has Issued Notice To Medak Sp-TeluguStop.com

పోలీసులు, మీడియా ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.మీడియా దాదాపు పాటిస్తూనే ఉంది.

అయితే బాలుడి చేతికి సంకెళ్లు వేయడంతో ఆ ఫొటో మీడియాలో వచ్చింది.పోలీసులకు నిబంధనలు తెలిసి కూడా ఈ పని చేశారు.

బాలుడికి సంకెళ్లు వేయడం నేరమైతే, అతన్ని పబ్లిగ్గా బస్సులో తీసుకెళ్లడం మరింత నేరం.అందుకే ఎస్‌పీకి నోటీసులు వెళ్లాయి.

ఈ ఘటనపై బాలల హక్కుల సంస్థ రాష్ర్ట హోం శాఖ కార్యదర్శికి కూడా లేఖ రాసింది.నేరం చేసిన బాలుడిని కోర్టు విచారణ తరువాత బస్సులో నిజామాబాద్‌లోని జువైనల్‌ హోంకు తీసుకెళుతుండగా జోగిపేట ప్రాంతంలో ఈ దృశ్యం కంటబడింది.

బాలుడి వెంట ఉన్న పోలీసు ఆ పిల్లవాడిని ‘నేరగాడు’ అని చెప్పాడు.ఒక దొంగతనం కేసులో ఈ బాలుడికి ప్రమేయం ఉందని పోలీసులు పట్టుకున్నారు.

అనంతరం మెదక్‌ జిల్లా సంగారెడ్డి కోర్టుకు తీసుకువచ్చారు.అక్కడ విచారణ తరువాత నిజామాబాద్‌కు తరలించారు.

మెదక్‌ ఎస్‌పి సుమంతి ఆ బాలుడికి బేడీలు వేసి బస్సులో తీసుకెళ్లి ఇద్దరు పోలీసులకు మెమోలు జాతీ చేశారు.బాలుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోడంతో పోలీసులు అతనికి బేడీలు వేసి ఉంటారని ఎస్‌పి మీడియాకు చెప్పారు.

తప్పించుకుంటే మాత్రం కరడుగట్టిన హంతకుడికి బేడీలు వేసినట్లు వేస్తారా? ఎస్పీ మీద, పోలీసుల మీద చర్య తీసుకుంటేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube