తెలంగాణ చీఫ్ సెక్రటరీ కీ కరోనా పాజిటివ్..!!

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.స్వయంగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 Telangana Chief Secretery Tested Positive-TeluguStop.com

దీంతో తనను ఇటీవల కలిసిన ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయమే అన్ని జిల్లాల కలెక్టర్లతో కరోనా నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అంతే కాకుండా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు.కరోనా వ్యాక్సిన్ మొదటి దశ వ్యాక్సిన్ కూడా రీసెంట్ గా తీసుకున్నా ఈయనకి కరోనా సోకడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 Telangana Chief Secretery Tested Positive-తెలంగాణ చీఫ్ సెక్రటరీ కీ కరోనా పాజిటివ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా కేసీఆర్ తో సోమేశ్ కుమార్ బేటీ కావటంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో టెన్షన్ నెలకొంది.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ విజృంభన భారీగా ఉండటంతో పాటు వరుసపెట్టి పండుగలు రావటంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ బహిరంగ ప్రదేశాలు మరియు పనిచేసే చోట తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించడం జరిగింది.

కరోనా నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

.

#Telangana #Somesh Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు