మంత్రి వర్గ విస్తరణపై మొదలైన ఊహాగానాలు... కొత్త అమాత్యులు ఎవరంటే?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం గందరగోళంగా మారింది.కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

 Telangana Cabinet Expansion Ministers-TeluguStop.com

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈటెల అంశం.అసలు ఈటెలను కేసీఆర్ టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియనప్పటికీ చాలా రకాల ఊహగానాలు ప్రచారంలో ఉన్నాయి.

కేటీఆర్ ను సీఎం చేయడానికి ఈటెల అడ్డుపడతాడనే భావనతో ఈటెలకు ముందస్తుగా చెక్ పెట్టాడని కేసీఆర్ వ్యతిరేక వర్గం ఇటు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.అయితే అసలు వ్యూహం ఏంటనే విషయం కేసీఆర్ కు తప్ప ఎవరికీ తెలియదు.

 Telangana Cabinet Expansion Ministers-మంత్రి వర్గ విస్తరణపై మొదలైన ఊహాగానాలు… కొత్త అమాత్యులు ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేయడంతో ఇక త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇది వరకే ఈటెలను భర్తరఫ్ చేయడంతో ఇంకో ముగ్గురు మంత్రులకు కేసీఆర్  ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆ మంత్రులు ఎవరినేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమైనప్పటికీ వారి స్థానంలో వచ్చే మంత్రులపై కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి.వారెవరు అని ఒకసారి పరిశీలిస్తే ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అన్నట్టు తెలుస్తోంది.

ఇవి ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడే వరకు మనం ధ్రువీకరించుకోవడానికి ఛాన్స్ లేనట్టు తెలుస్తోంది.

#Etela Rajender #Trs Party #CM KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు