అయ్యో బీజేపీ ! మళ్లీ మొదటికొచ్చేశారా ? 

తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతుండటంతో , ఆ పార్టీని గద్దె దించి తాము అధికారంలోకి వస్తామని మొన్నటివరకు తెలంగాణ బిజెపి నాయకుల్లో ధీమా కనిపించింది.దీనికి తగ్గట్టుగానే ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గెలవడం,  అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి ఊహించని స్థాయిలో సీట్లు రావడం మొదలైన కారణాలతో తామే అధికారంలోకి వస్తామని తెలంగాణ బిజెపి నాయకులు నమ్ముతూ వస్తున్నారు.

 Telangana Bjp Is Troubled With So Many Problems, Bjp, Telangana, Kcr, Ktr, Trs,-TeluguStop.com

అంతా ఇదే నమ్మకంతో ఉన్నారు.ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవడం,  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలోనూ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం,  అలాగే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం , ఇలా ఎన్నో అంశాలతో బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయిన తర్వాత బిజెపికి ఊపు వచ్చింది.మొదట్లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపించినా, ఇప్పుడు మాత్రం ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది.

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం బాగా తగ్గిపోవడం,  ధరల పెరుగుదల తో పాటు, కరోనా ను కంట్రోల్ చేయలేకపోయారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం,  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ఆశాజనకంగా ఫలితాలు లేకపోవడం,  ప్రధాని మోదీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గడం,  దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు తెలంగాణ వైపు రావడం , ఇలా ఎన్నో కారణాలతో బిజెపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
  దీంతో 2023 ఎన్నికల్లో గెలుపు పై పెద్దగా నమ్మకం లేనట్టుగా బీజేపీ నాయకుల వ్యవహారం కనిపిస్తోంది.

Telugu Bandi Sanjay, Bjp Graph, Dubbaka, Ghmc, Khammam, Kishan Reddy, Sagar, Tel

అలాగే తెలంగాణ బిజెపి లో రెండు గ్రూపులు ఉన్నాయి అని, ఒక గ్రూప్ బండి సంజయ్,  మరో  గ్రూపు కిషన్ రెడ్డి  మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లుగా వ్యవహారాలు కనిపిస్తుండటం,   ఇలా ఎన్నో అంశాలు తెలంగాణలో బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.ఇవన్నీ తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు బాగా కలిసి వస్తున్నాయి.మొదట్లో బీజేపీ లో ఉన్న ఉత్సాహం తెలంగాణ బిజెపి నాయకుల్లో ఇపుడు కనిపించకపోవడం,  ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైలెంట్ అయిపోవడం ఇవన్నీ లెక్కలోకి వస్తున్నాయి.ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు బీజేపీ కి తెలంగాణలో ఇబ్బందికరంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube