తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కంటే ఎక్కువగా జనాల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు.కాంగ్రెస్ ను ప్రజలు మరిచిపోయినా, రేవంత్ రెడ్డి మాత్రం పదే పదే ఏదో ఒక అంశంతో జనాల్లోకి పార్టీని దగ్గర చేసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఒకవైపు అధికార పార్టీ టిఆర్ఎస్, మరోవైపు తెలంగాణలో బలం పెంచుకుంటూ వస్తున్న బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటూ, తన సత్తా ఎప్పటికప్పుడు చాటుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రతి దశలోనూ ప్రయత్నిస్తూనే వస్తున్నారు.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంది.
కానీ ఇప్పుడు ఆ పార్టీ పై వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతుండడంతో, బిజెపి ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది.అనుకున్న మేరకు సక్సెస్ అయింది.
దుబ్బాక ఎన్నికల ఫలితాలతో పాటు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తన సత్తా చాటుకుంది.
టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బిజెపి నిరూపించుకుంది.
దీంతో కాంగ్రెస్ పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది.అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యూహాలతో ఇప్పుడు బీజేపీ సంగతి మర్చిపోయే విధంగా చేయడంలో సక్సెస్ అవుతున్నారు.
తాజాగా ఆయన రైతుల కోసం చేపట్టిన పాదయాత్ర పది రోజులు పూర్తి చేసుకున్నా నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభ సక్సెస్ అవ్వడంతో పాటు, కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నూతన ఉత్సాహం కనిపిస్తోంది.
ఇప్పుడు జనాల్లో బీజేపీ కంటే రేవంత్, కాంగ్రెస్ పైన చర్చ జరుగుతోంది.బిజెపి ఎప్పుడు మతాల అంశాన్ని ప్రస్తావిస్తూ, మాత రాజకీయాలనే హైలెట్ చేస్తోందని సామాన్యులు, రైతులు, నిరుద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించకపోవడం వంటి వ్యవహారాలన్నీటిపైనా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా రేవంత్ పాదయాత్ర తర్వాత బీజేపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.అంతే కాకుండా, కేంద్రంలో బిజెపి ప్రజా వ్యతిరేక ధోరణి, పెట్రోల్, డీజిల్ పెరుగుదల , ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ, ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.జనాలలోనూ బీజేపీపై ఆదరణ తగ్గిపోవడం, వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితులు, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.ఇప్పుడు బీజేపీకి, టీఆర్ఎస్ కంటే రేవంత్ భయమూ పెరిగిపోతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.