కేసీఆర్ దెబ్బకు బీజేపీ విలవిల ? ఫిర్యాదులు ?

తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణ వ్యక్తి కాదు.రాజకీయాలను ఆయన బాగా ఒడిసి పట్టారు.

 Kcr, Telangana,hujurabad, Trs, Telangana Bjp, Bandi Sanjay, Kcr Modhi, Amith Sha-TeluguStop.com

ఏ సమయంలో ఏ విధంగా రాజకీయం చేయాలి అనేది ఆయనకు బాగా తెలుసు.అందుకే ఆయన టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు, ఆ తరువాత రెండు సార్లు టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం లోనూ సక్సెస్ అయ్యారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పెరుగుతోంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కేసీఆర్ వ్యూహాలు రూపొందించి , ఆ వ్యతిరేకతను పోగొడుతూ ఉంటారు.కెసిఆర్ రాజకీయం  మిగతా పార్టీలకు ఎలా ఉన్నా, బిజెపి మాత్రం ఇప్పుడు విలవిలలాడుతోంది.

తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి ఎదుగుతున్న సమయం లో కేసీఆర్ ఆ పార్టీని దెబ్బ తీసే విధంగా వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు.

ఢిల్లీకి వెళ్లిన సమయంలో బిజెపి కేంద్ర పెద్దలను ఆయన కలవడం, వారితో సఖ్యతగా మెలగడం , వారూ అంతే స్థాయిలో కేసీఆర్ కు ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ తెలంగాణ బిజెపి నాయకులకు ఇబ్బందికరంగా మారాయి.

ఒక పక్క  క్షేత్రస్థాయిలో  పోరాటాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై చేస్తుండగా, కేంద్ర బిజెపి పెద్దలు కెసిఆర్ కు ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ తెలంగాణ బిజేపి నేతలకు ఇబ్బందికరంగా మారాయి.అలాగే ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ తో ఆయన భేటీ కావడం వంటి వ్యవహారాలపై తెలంగాణ బిజెపి నేతలు మండిపడుతున్నారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Hujurabad, Kcr Modhi, Telangana, Telangana Bjp-T

ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన సాయంత్రం విమర్శలు తెలంగాణ బిజెపి నేతలు చేయించారు.ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.మరో పక్క చూస్తే కేంద్ర బిజెపి పెద్దలు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇవన్నీ తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.కెసిఆర్ వ్యూహాత్మకంగానే కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ, తెలంగాణలో బిజెపికి ఇబ్బందులు తెచ్చి పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు రోజురోజుకు తెలంగాణ బిజెపి నేతల్లో పెరుగుతూ అసహనం పెంచుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube