తెలంగాణలో కాంగ్రెస్ ( Congress party ) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.
పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.తమ పంతం నెగ్గించుకోవాలనే అభిప్రాయంతో ఉండడం, సీనియర్, జూనియర్ అంటూ విభేదాలు తలెత్తనం ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకు అడ్డం పడుతూనే వస్తున్నాయి.
ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ బిజెపి లోను( Telangana BJP ) కనిపిస్తోంది.క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ వచ్చిన బిజెపిలోనూ ఇప్పుడు గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.
ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ, పార్టీలోని కీలక నాయకులు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.దీంతో అసలు తెలంగాణ బిజెపిలో ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు( MLC Kavitha ) ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) స్పందిస్తూ చేసిన విమర్శలపై బీజేపీలోని కొంతమంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.మీడియా సమావేశాలు నిర్వహించారు.
ముఖ్యంగా నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్( MP Aravind ) సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టగా, ఆయనకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు స్పందించారు.ఈ వ్యవహారం ఇలా ఉండగానే హుజురబాద్ బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్( Etela Rajender ) చేరికల కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే తాను రాజీనామా చేయడం లేదని, ఇవన్నీ వట్టి పుకార్లేనని రాజేందర్ వివరణ ఇచ్చినా రాజీనామా వార్తల ప్రచారం మాత్రం ఆగడం లేదు.సరిగ్గా ఇదే సమయంలో ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లడంతో, ఆయన రాజీనామాను అధిష్టానం పెద్దలకు అందించేందుకే వెళ్లారనే అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది.రాజేందర్ ఢిల్లీ టూర్ లో కేంద్ర బీజేపీ పెద్దలతోనూ, కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో బిజెపిలో చేరికలు లేకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయంపై రాజేందర్ ను అధిష్టానం పెద్దలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీరియస్ గా చేరుకలపై దృష్టి పెట్టాలని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు సమాచారం.

దీనిపై రాజేందర్ వాదన మరోలా ఉంది.పార్టీలో చేరేందుకు చాలా మంది కీలక నేతల సిద్ధంగా ఉన్నారని, అయితే వారికి టిక్కెట్ హామీ ఇవ్వాల్సి ఉంటుందని , కానీ బిజెపిలో టిక్కెట్ హామీ ఇచ్చే పరిస్థితులు , తాను సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతోనే రాజేందర్ చేరికలపై దృష్టి సాధించలేకపోతున్నారట.ఒకవైపు తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.
ఫిర్యాదులు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుండడం తదితర అంశాలపై బిజెపి అధిష్టానం పెద్దలు సీరియస్ గా ఉన్నారట.త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు , మరి కొంత మంది కీలక నాయకులు పర్యటించి పార్టీలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దబోతున్నారట.
