తెలంగాణ బిజెపి ప్రక్షాళన ? సంజయ్ స్థానంలో ఎవరు ? 

తెలంగాణలో బిజెపిని( Telengana BJP ) అధికారంలోకి తీసుకొచ్చే విషయంపై ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించింది.కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బిజెపి అలర్ట్ అవుతోంది.

 Who Will Replace Sanjay Details, Brs, Bjp, Telangana, Telangana Bjp, Bandi Sanj-TeluguStop.com

తెలంగాణలో  ఆ పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది.సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, తెలంగాణలో ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంతో పాటు ,పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా అనేక ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు .దీనిలో భాగంగానే పార్టీని ప్రక్షాళన చేయాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడి తో సహా కమిటీలో మార్పు చేర్పులు చేయాలనే ఆలోచనకు వచ్చారట.

అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్( Bandi Sanjay as president of Telangana BJP ) బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడం , బీఆర్ఎస్( BRS ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం వంటి అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకుని , సంజయ్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉందట.

Telugu Bandi Sanjay, Bandisanjay, Etela Rajendar, Hujurabad Mla, Karnataka, Tela

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించుకుందట.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లో పాత , కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సత్సంబంధాలు ఏర్పడకపోవడం, బీఆర్ఎస్ ,కాంగ్రెస్ ల దూకుడుకు బ్రేక్ లు వేసే విషయంలో వెనకబడడం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్నారట.అయితే గత మూడేళ్లుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు, అధికార పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపిని బలోపేతం చేశారని, అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే అంత స్థాయిలో బండి సంజయ్ వ్యూహాలు పనిచేయవని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు.

పార్టీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీలలో సంస్థగతంగా వివిధ స్థాయిల్లో మార్పులు చేపట్టాలనే ఆలోచనకు అధిష్టానం పెద్దలకు వచ్చారట.

Telugu Bandi Sanjay, Bandisanjay, Etela Rajendar, Hujurabad Mla, Karnataka, Tela

దీనిలో భాగంగానే సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి పార్టీ అధ్యక్షుడిగా తప్పించాలనే ఆలోచనకు వచ్చారట.ఆయన స్థానంలో రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గం కు చెందిన వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారట.ఈ నేపథ్యంలోనే పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Tour Minister Kishan Reddy ), హుజురాబాద్ ఎమ్మెల్యే చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పేరు తెరపైకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube