బురద జల్లాలనుకుంటే .. మీద పడిందిగా కడుక్కోండి

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే అది రివర్స్ అయ్యి తమ మెడకే చుట్టుకుంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎదురైంది.

 Telangana Bjp President Kishan Reddy Comments Kaleswaram Project , Brs, Bjp, C-TeluguStop.com

కాంగ్రెస్ ను ఇరుకును పెట్టేందుకు కిషన్ రెడ్డి చేసిన విమర్శలు తిరిగి బిజెపిని నవ్వుల పాలయ్యేలా చేసింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు( kaleswaram project, ) ప్రధానమైనది .దీంట్లో భారీగా అవకతవకలు జరిగాయని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.ఇక ఎన్నికల సమయంలో బిజెపి కూడా కాలేశ్వరంపై బీ ఆర్ ఎస్ పై విమర్శలు చేయడంతో పాటు , కేంద్ర బృందాలను రంగంలోకి దింపి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించి కేంద్రానికి నివేదికను అందించారు.

Telugu Congress, Kishan Reddy, Revanth, Telangana Bjp, Telangana Cm, Telangana-P

పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంటుందని, పునాదులు సక్రమంగా లేకపోవడం వల్లనే కుంగిపోయింది అని కేంద్రానికి తమ నివేదికను అధికారులు అందించారు.ఈ వ్యవహారం అంతా ఎన్నికల కు కొద్దిరోజులు ముందుగానే జరగడంతో,  బీఆర్ఎస్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి.ఆ పార్టీ ఓటమి చెందడానికి కూడా పరోక్షంగా ఇది కారణమైంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth reddy )బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తానని శాసనసభలో ప్రకటించారు.ఈ ప్రాజెక్టు నిర్మించిన కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా అనేక లొసుగులు ఉన్నాయని,  దీనిపైన విచారణ చేస్తామని ప్రకటించారు.

Telugu Congress, Kishan Reddy, Revanth, Telangana Bjp, Telangana Cm, Telangana-P

తాజాగా ఈ ప్రాజెక్టు అంశంపై కేంద్ర మంత్రి.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు.కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినా ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని ఆయన విమర్శలు చేశారు .అయితే ఆ విమర్శలే కిషన్ రెడ్డి-  బిజెపి కి ఇబ్బందికరంగా మారాయి.ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత( Kavitha )ను <రక్షించిన బిజెపి ప్రభుత్వం,  కాలేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ విచారణకు తాము కోరితే కేసీఆర్ ను రక్షించడానికేనా అని ప్రశ్నించారు.

సిబిఐ అంటేనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సంస్థ అని,  నిజంగా బిజెపి పెద్దలకు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయించాలనుకుంటే అది సాధ్యమవుతుందని కానీ,  దానిని పక్కనపెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని సిబిఐ విచారణ కోరడం లేదని విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి.కాంగ్రెస్ ఎదురుదాడి తో బిజెపితో పాటు కిషన్ రెడ్డి నవ్వుల పాలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube