రేవంత్ పరిస్థితే బండి సంజయ్ ఎదుర్కొంటున్నాడా ?  

telangana bjp president bandi sanjay troubled on own party leaders behaviour, Revanth Reddy, Bandi Sanjay, BJP, Telangana, TRS, 2023 Elections, Raja Singh, Telangana BJP Leaders, Dharmapuri Aravindh, - Telugu @bandisanjay_bjp, 2023 Elections, Bandi Sanjay, Bjp, Dharmapuri Aravindh, Raja Singh, Revanth Reddy, Telangana, Telangana Bjp Leaders, Trs

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీ నాయకులు కలిసివచ్చినా, రాకపోయినా పార్టీ కి ఏదో రకంగా ఊపు తీసుకువచ్చి 2023 ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

TeluguStop.com - Telangana Bjp President Bandi Sanjay Troubled On Own Party Leaders Behaviour

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కానీ రేవంత్ కు అడుగడుగునా సొంత పార్టీ నాయకులే అడ్డుతగులుతూ, ఆయన హవా పెరగకుండా నిత్యం ప్రయత్నిస్తున్నారు.రేవంత్ ఏ కార్యక్రమం తలపెట్టినా, సీనియర్ నాయకులు ఎవరు పెద్దగా సహకరించక పోగా, అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - రేవంత్ పరిస్థితే బండి సంజయ్ ఎదుర్కొంటున్నాడా -Political-Telugu Tollywood Photo Image

దీని కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ బలపడకపోగా, మరింత బలహీనం అవుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే, సరిగ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం అదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పార్టీకి మేలు జరిగే విధంగా వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే విధంగా, బండి సంజయ్ వినూత్నమైన కార్యక్రమాలు రూపొందిస్తూ, పార్టీని పరుగులు తీస్తూ వస్తున్నారు.క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేపడుతూ జనాల్లోకి బీజేపీ వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నారు.

కానీ ఇవేమీ పట్టినట్టు మిగతా నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఈ పరిణామాలతో బండి సంజయ్ అసహనం గా ఉన్నారట.కేవలం ఒకరిద్దరు నాయకులు మాత్రమే యాక్టివ్ గా ఉంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరిస్తున్నారని, కానీ మిగతా నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటివి పెద్ద ఇబ్బందికరంగా మారింది.టిఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో మరో ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టిగానే మాట్లాడుతున్నాడు.

అలాగే ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

కానీ మిగతా నాయకులు ఎవరు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంతో, ఈ విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నాయకుల వ్యవహార శైలి ఈ విధంగా ఉంటే, 2023లో అధికారం దక్కించుకోవడం అసాధ్యం అనేది సంజయ్ అభిప్రాయం.ఈ మేరకు సమగ్రమైన నివేదికను కూడా అధిష్టానం పెద్దలకు సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది.

#Bandi Sanjay #Revanth Reddy #Raja Singh #2023 Elections #TelanganaBJP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Bjp President Bandi Sanjay Troubled On Own Party Leaders Behaviour Related Telugu News,Photos/Pics,Images..