' బండి ' ని ఫాలో అవుతారా ? పేచీలు పెడతారా ?

తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచింది.2023 లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా బిజెపి అధికారంలోకి వస్తుంది అని నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఏర్పడింది.దీనికి తగ్గట్లుగానే బిజెపి పెద్దలు తెలంగాణలో బీజేపీ బల పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ,  పార్టీ రాష్ట్ర నాయకులను ప్రోత్సహిస్తున్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విషయంలో అన్ని రకాలుగానూ మద్దతు తెలుపుతున్నారు.

 Telangana Bjp Party Facing Issues With Group Politics Against Bandi Sanjay Detai-TeluguStop.com

తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ ను ఓడించగలదు అనే నమ్మకం అందరిలోనూ నెలకొంది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించడం , దానికి భారీగా స్పందన రావడం… ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం దీనికి భారీ ఎత్తున జన సందోహం రావడం తెలంగాణ బీజేపీ లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

  అయితే ఎన్నికల వరకు పార్టీ నాయకులంతా సమిష్టిగ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా ఏకతాటిపై వెళ్తారా అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీరు పై పార్టీ సీనియర్ నాయకులు, కీలక నేతల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బండి సంజయ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారని,  మిగతా వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి బిజెపి నాయకుల్లో ఉంది.ముఖ్యంగా అమిత్ షా సభకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్రకటనల్లో ఎమ్మెల్యేలు , ఎంపీలు,  కీలక బీజేపీ నాయకుల ఫోటోలు లేకపోవడం వంటివి అప్పుడే అసంతృప్తిని రాజేస్తున్నాయి.

ముఖ్యంగా కిషన్ రెడ్డి వర్గం సంజయ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సైతం సంజయ్ తీరుతో అసంతృప్తితో ఉన్నారట.
 

Telugu Amith Sha, Bandi Sanjay, Bjp, Etela Rajender, Kishan Reddy, Telangana Bjp

తాను పార్టీలో అనేకమందిని నేర్చుకుంటున్నానని ఆ సందర్భంలో వారికి అంశంతో పాటు అనేక హామీలు ఇస్తున్నానని, దీనిపై సంజయ్ సరిగా స్పందించడం లేదని,  వారికి రాదు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వంటివి రాజేందర్ కు ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువగానే ఉన్నా… అవి పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.కానీ బండి సంజయ్ ఒంటెద్దు పోకడతో ముందుకు వెళుతున్నారనే అసంతృప్తి తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులలో ఎక్కువగా ఉంది.వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే బండి సంజయ్ ఆజ్ఞను పాటిస్తూ ఎన్నికల వరకు సమిష్టిగా తెలంగాణ బీజేపీ నాయకులంతా ముందుకు వెళ్తారా అనే విషయం లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube