టార్గెట్ 2023: చేరికలపై బీజేపీ దృష్టి

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెడుతోంది.మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ బీజేపీ పావులు కదుపుతోంది.

 Telangana Bjp Operation Akarsh Target 2023 Elections Details, Telangana Bjp , Bjp, Bjp Operation Akarsh ,2023 Elections, Etela Rajender, Advocate Rachana Reddy, Bandi Sanjay, Tharun Chugg, Cm Kcr, Trs Party, Chikoti Praveen-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండాఎగుర వేయడానికి పగడ్బందీగా పనిచేస్తోంది.దీంతో భారతీయ జనతాపార్టీ వైపు టీఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనేకమంది నేతలు ఆకర్షితులవుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశమయ్యారు.తెలంగాణలోని ఇతర పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో బీజేపీలో చేర్చుకోవడంపై బీజేపీ దృష్టిపెట్టింది.ఆపరేషన్ ఆకర్ష్ మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది.2023 ఎన్నికలో టార్గెట్ గా పావులు కదుపుతోంది.పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్న నేతల జాబితాతో ఢిల్లీకి వచ్చిన చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ , పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణలతో రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు.

 Telangana Bjp Operation Akarsh Target 2023 Elections Details, Telangana Bjp , Bjp, Bjp Operation Akarsh ,2023 Elections, Etela Rajender, Advocate Rachana Reddy, Bandi Sanjay, Tharun Chugg, Cm Kcr, Trs Party, Chikoti Praveen-టార్గెట్ 2023: చేరికలపై బీజేపీ దృష్టి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సమావేశంలో వివిధ పార్టీల నుంచి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్న 18 మంది గురించి చర్చించారు.

వారి బలాబలాలు, వ్యక్తి గత అంశాలపై ఆరా తీశారు.వారి వల్ల పార్టీకి కలిగే మేలు, వారి ఆశిస్తున్న స్థానాలపై చర్చించారు.వీరు రాష్ట్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరేలా ఏర్పాట్లు చేయాలా, ఢిల్లీ లోకాషాయం కండువా కప్పాలా అనేవిషయంపై చర్చించారు.హైకమాండ్ ఆదేశాల ప్రకారం పార్టీలో చేర్చుకోవాలని ఆ దిశగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

బీజేపీలో చేరే వారి లిస్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు, కేసీఆర్ కు దూరమైన తెలంగాణ వాదులు ఉన్నట్టు తెలిసింది.వీరితో పాటు గ్రౌండ్ లెవిల్ లో మరో 40 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

తాజాగా ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి బీజేపీలో చేరారు.పార్టీలో చేరికలపై స్పందించిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి స్థాయి వరకూ అందరూ తమతో టచ్ లో ఉన్నారన్నారు.మరోవైపు గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ కేసీఆర్ను గద్దెదించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాళేశ్వరాన్ని నిండా ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందని సంజయ్ విమర్శించారు.

క్యాసినో దందాలో విచారణ ఎదుర్కొటున్న చీకోటి ప్రవీణ్ తో టీఆర్ఎస్ నేతల్లో సగం మందికి సంబంధాలున్నాయన్నారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ కు 15 సీట్లు కూడా రావని బండి సంజయ్ అన్నారు.కేసీఆర్ కూడా గెలవరని ఆయన అన్నారు.

కేసీఆర్ , ఆయన కుటుంబమే తమకు అస్త్రాలని ఆయన అన్నారు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీయేనని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ సీనియర్ నేతలంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube