పొంగులేటి కారణంగా తెలంగాణ బీజేపీలో చాలా పెద్ద డ్యామేజ్‌

తెలంగాణ లో బీజేపీ( BJP ) అనూహ్యంగా పుంజుకుంది అనుకుంటూ ఉన్న సమయంలో ఆ పార్టీలో విభేదాలు మొదలు అయ్యాయి అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈటెల రాజేందర్ బీజేపీలో అడుగు పెట్టిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) కి ఇబ్బందులు మొదలు అయ్యాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Telangana Bjp Leaders Not Unity Etela Rajendar And Bandi Sanjay , Bandi Sanjay-TeluguStop.com

అన్ని తానై పార్టీని రాష్ట్రంలో ఈ స్థాయికి తీసుకు వస్తే ఇప్పుడు వచ్చి ఈటెల పార్టీని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ బండి లో గుబులు పట్టుకుంది అంటూ ఆ మధ్య బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేశారు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajendar, Telangana Bjp, Ts-Telugu Politica

ఆ విషయంలో నిజం ఎంతో కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కారణంగా బీజేపీ లో మరింతగా విభేదాలు మొదలు అయ్యాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ లోకి తీసుకు రావడం లో ఈటెల విఫలం అయ్యాడు.చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల కు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడం లో విఫలం అయ్యాడు.

అందుకే ఈ విషయంలో బీజేపీ సీరియస్ గా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajendar, Telangana Bjp, Ts-Telugu Politica

ఈ విషయాన్ని బండి స్వయంగా వెళ్లి అధినాయకత్వం వద్ద ఈటెల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని బీజేపీ లో చేరే విధంగా ఒప్పించేందుకు తాను చేసిన ప్రయత్నం ముందు ఈటెల ( Etela rajendar )ఏమాత్రం చేయలేదు అంటూ బండి సంజయ్ అధినాయకత్వం వద్ద చెప్పారు అంటూ ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.మొత్తానికి పొంగులేటి ఇటీవలే కాంగ్రెస్ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.

అందుకు గాను బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ కొందరు బీజేపీని హెచ్చరిస్తున్నారు.ఈటెల యొక్క ప్రయత్న లోపం కారణంగానే పొంగులేటి మిస్ అయ్యాడు అనేది కొందరు బీజేపీ నాయకుల ఆరోపణ.

కావాలని పొంగులేటి చేజారి పోయేలా ఈటెల పార్టీకి నష్టం చేశాడని.పార్టీ లో కోవర్ట్‌ ఈటెల అంటూ బండి వర్గం వారు ఆరోపణలు చేస్తున్నారట.

ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం అంతా బాగానే ఉందని పుకార్లు విపక్ష పార్టీ లు పుట్టిస్తున్నాయి అంటూ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube