అదిగో ఇదిగో అనడమేనా ? హుజూరాబాద్ లో ఇంకెప్పుడు ? 

అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం వెలువడక పోవడంతో బీజేపీ కేంద్ర పెద్దలపై తెలంగాణ బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.అసలు కేసీఆర్ ఒత్తిడితోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి అనే ప్రచారం జనాలలోను కలిగింది.

 Telangana Bjp Leaders Are Dissatisfied With The Delay In The Notification Of Ele-TeluguStop.com

  ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేయడంతో, అది అవమానంగా భావించిన రాజేందర్ తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలలోనూ సెంటిమెంట్ ఏర్పడింది.

అప్పుడే ఎన్నికల తంతు జరుగుతుందని రాజేందర్ తో పాటు మిగతా రాజకీయ పార్టీలు భావించాయి.
    ఈ మేరకు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు , రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ నాయకులందరినీ హుజూరాబాద్ నియోజకవర్గం లో మోహరించారు.

ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరించే విధంగా ప్రణాళికలు వేసుకుని అమల్లో పెట్టారు.అయితే అకస్మాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ తెలంగాణలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేసింది దీంతో హుజురాబాద్ లో సందడి వాతావరణం తగ్గిపోయింది.అన్ని రాజకీయ పార్టీలు హడావుడి తగ్గించాయి.హుజురాబాద్ ఎన్నికలను పక్కన పెట్టినట్లు గానే అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి.ఎన్నికల ఆలస్యమయ్యే కొద్దీ ఎక్కువగా నష్టపోయేది బీజేపీనే.

దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విషయమై బీజేపీ అధిష్టానంపై రాష్ట్ర నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు.బిజెపి కేంద్ర పెద్దల లెక్క ప్రకారం సెప్టెంబర్ 17 ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని, అమిత్ షా బహిరంగ సభ ను హుజూరాబాద్ నియోజకవర్గం లో పెట్టవచ్చని అంతా భావించారు. 

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Hujurabad, Padayathra, Revanth Re

   కానీ అవేమీ జరగలేదు.ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర తెలంగాణ లో కొనసాగుతోంది.ఎప్పటికప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పై కేంద్ర బిజెపి పెద్దలు హడావుడి చేయడం తప్పించి,  నోటిఫికేషన్ వెలువడక పోవడంతో , ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమయ్యే కొద్దీ, తామే నష్టపోతున్నామనే భావన తెలంగాణ బిజెపి నాయకుల్లో కలుగుతోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube