తెలంగాణ బిజెపి నాయకులకు అమిత్ షా వార్నింగ్ ?

తెలంగాణలో బలపడాలని తహతహలాడుతున్న బిజెపి అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు వేస్తూ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది.ఏ చిన్న అవకాశం దొరికినా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తమ పరపతిని పెంచుకునే విధంగా తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.

 Telangana Bjp Leaders Amith Shah-TeluguStop.com

దీనికి తగ్గట్టుగానే కేంద్ర బిజెపి పెద్దలు కూడా తెలంగాణ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఏ విధంగానైనా సరే అధికారంలోకి రావాలనే ఆశయంతో బీజేపీ అగ్ర నాయకులు ఉన్నారు.

అందుకే స్వయంగా బిజెపి చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగి తెలంగాణలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు.దీంతో ఆ పార్టీ నాయకులు మరింత ఉత్సాహం పెరిగి బాగా యాక్టివ్ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనుకూలమైన ఫలితాలు రావడంతో బిజెపి నేతలు మరింత ఉత్సాహం పెరిగింది.అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారట.ఎవరూ తొందరపడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని అమిత్ షా చెప్పినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటి అనే విషయం తెలంగాణ బిజెపి నాయకులు కూడా తెలియడం లేదు.కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని కెసిఆర్ ఆధ్వర్యంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube