కేంద్ర‌మంత్రిపై ఫైర్ అవుతున్న తెలంగాణ బీజేపీ.. త‌మ క‌ష్టం వృథా అవుతోంద‌ట‌..

ఇప్పుడు అన్ని పార్టీల కంటే మంచి జోష్‌లో ఉంది బీజేపీ.అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉంటామ‌ని చెబుతూ అందుకు త‌గ్గ‌ట్టుగానే రాజ‌కీయ పునాదులు వేస్తున్నారు క‌మ‌ల‌నాథులు.తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకునేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంంలో ఇప్పుడు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు బాగానే మ‌ద్ద‌తు వ‌స్తోంది.ఇంకోవైపు త్వ‌ర‌లోనే విమోచ‌న దినం స‌భ‌ను కూడా పెద్ద ఎత్తున నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేత‌లు.

 Telangana Bjp Is Firing On The Union Minister Their Hard Work Is Being Wasted-TeluguStop.com

ఇంత‌లా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు నేత‌లు.

నేరుగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ త‌మ‌దైన శైలిలో దూసుకుపోతున్నారు.అయితే ఇంత చేస్తున్నా కూడా కొంద‌రు బీజేపీ అగ్ర నేత‌లు చేస్తున్న ప‌నులు రాష్ట్ర బీజేపీ నేతల‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి.

 Telangana Bjp Is Firing On The Union Minister Their Hard Work Is Being Wasted-కేంద్ర‌మంత్రిపై ఫైర్ అవుతున్న తెలంగాణ బీజేపీ.. త‌మ క‌ష్టం వృథా అవుతోంద‌ట‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు చేస్తున్న ప‌నులు తెలంగాణ బీజేపీకి నాయ‌కుల‌కు పెద్ద‌గా మింగుడు పడట్లేద‌ని తెలుస్తోంది.తాము ఇంత‌లా కేసీఆర్‌పై రాజకీయ పోరాటం చేస్తున్నా కూడా దాన్ని నీరుగార్చే విధంగా మొన్న కేసీఆర్‌తో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్ నిర్వ‌హించారు.

Telugu Amith Sah, Bjp Leaders, Cm Kcr, Ktr, Modi, T-bjp, Tg News, Tg Politics, Trs, Ts Politics-Telugu Political News

పలువురు కేంద్రమంత్రులు కూడా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.దీంతో ఈ ఉదంతం తెలంగాణ బీజేపీ నేతలకు పెద్ద ఎత్తున చిక్కులు తెచ్చిపెడుతోంది.ఇదిలా ఉండ‌గా ఇప్పుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అయిన జ్యోతిరాధిత్య కూడా మ‌రో విధంగా తెలంగాణ నేత‌లకు చిక్కులు తెచ్చిపెట్టారు.ఆయ‌న మొన్న వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌గతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో మీటింగ్ నిర్వ‌హించ‌డంతో పాటు అక్క‌డే కేసీఆర్, కేటీఆర్‌తో లంచ్ చేయ‌డంతో బీజేపీ నేత‌ల‌కు చిక్క‌లు వ‌చ్చిప‌డ్డాయి.

తాము ఎంత‌లా పోరాడుతున్నా ఇలా కేంద్ర పెద్ద‌లు చేస్తున్న ప‌నుల‌తో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నామ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని, త‌మ‌కు ఇది ఇబ్బందిగా మారిందని భావిస్తున్నారు.

.

#CM KCR #Bjp #Tg #BJP #Tg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు