తెలంగాణ అసెంబ్లీలో నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో బీఏపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈనెల 8వ తేదీన బీఏసీ మరోసారి సమావేశమై తదుపరి షెడ్యూల్ పై చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో రేపు గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
అదేవిధంగా ఈనెల 6న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఈనెల 8న బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుండగా… ఈనెల 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.