ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు     2017-01-18   21:35:22  IST  Raghu V

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ క్రితం ఎక్కడైతే తన ఆటని ఆపేశారో, ఇప్పుడు పునరాగమనంలో తిరిగి అక్కడినుంచే మొదలుపెట్టారు. మేం మాట్లాడుతున్నది నెం1 స్థానం గురించి. పదేళ్ళైనా పవర్ తగ్గలేదు అన్నట్లుగా, వచ్చిరాగానే కలెక్షన్ల కనకవర్షం కురిపించి రికార్డులమోత మోగిస్తున్నారు. బాహుబలి తరువాత వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు సృష్టించిన మెగాస్టార్, అదే పద్ధతిలో మొదటివారం కలేక్షనల్లో కూడా బాహుబలి తరువాతి స్థానాన్ని ఆక్రమించేసారు. కాని ఇక్కడో విషయం గమనించాలి.

ఓపెనింగ్ విషయంలో కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే చిరంజీవికి రికార్డులు దక్కాయి. ఇటు నైజాంలో, అటు రాయలసీమలో మెగాస్టార్ రికార్డు స్థాయి ఓపెనింగ్ ఇవ్వలేదు. తెలంగాణలో బాహుబలి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాతి ప్లేస్ లో నిలిస్తే, సీడెడ్ లో బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత మూడోవ అతిపెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది ఖైదీనం 150.

ఇప్పుడు మొదటివారం కలెక్షన్లలో కూడా అదే వరస. ఆంధ్రలో ఆరుకి ఆరు ట్రేడ్ ఏరియాల్లో బాహుబలిని దాటిన ఖైదీ, తెలంగాణలో, సీడెడ్ లో వెనుకబడిపోయింది. తెలంగాణలో బాహుబలి, జనతగ్యారేజ్, శ్రీమంతుడు చిత్రాల తరువాత నాలుగోవ స్థానం మెగాస్టార్ సినిమాది.

ఈ తేడా ఎందుకు అంటారు ? తెలంగాణ ప్రజల్లో చిరంజీవి మీద మరీ ఒకప్పటి ఇంటరెస్ట్ లేదా, లేదంటే ఆయన రాజకీయ జీవితం ప్రభావం ఏమైనా ఉందంటారా ?