తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress )ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే.హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సచివాలయానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సాయంత్రం.మంత్రులతో మొదటి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 9వ తారీకు సోనియా గాంధీ జన్మదినోత్సవం నేపథ్యంలో.రెండు గ్యారెంటీలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
మొదటి గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండవ గ్యారెంటీ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పెంపు.ఇక ఇదే సమయంలో డిసెంబర్ 9వ తారీకు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డితో క్యాబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.డిసెంబర్ 9వ తారీకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే ఆరు గ్యారెంటీ హామీలకి( six guarantees ) చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని ప్రచారంలో తెలిపారు.ఈ నేపధ్యంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఆరు గ్యారెంటీ హామీలలో రెండు గ్యారెంటీ హామీలు… డిసెంబర్ 9న అమలు చేయటానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోన్నట్లు మంత్రులు వెల్లడించారు.