మూడో రోజు చేరిన అసెంబ్లీ సమావేశం.. కీలక నిర్ణయాలు !

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే.అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ సమావేశాలు షురూ అయ్యాయి.

 Telangana, Assembly, Meeting, Key Decisions, Congress, Mim, Pranab Mukharjee, So-TeluguStop.com

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన (మంగళవారం) స్టార్ట్ అయిన సమావేశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మొదటి రోజు అసెంబ్లీలో ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ, టీఆర్ఎస్ దుబ్దాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డిలకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

రెండవ రోజు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అందించాలని ప్రతిపాదించారు.

తెలంగాణ శాసన సభ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ రోజు జరిగే సమావేశంలో ప్రశ్నోత్తరాలతో ప్రారంభించారు.అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు నాలుగు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.

వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.ప్రశ్నోత్తరాలు సమయం ముగిశాక రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

అయితే ఈ బిల్లుల ప్రతిపాదనలపై ఎంఐఎం పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తపరిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube