తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది.

 Telangana Assembly Election Polling Is Over-TeluguStop.com

చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

అయితే పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.దీంతో వీరంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరో రెండు గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube