తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది.
ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ క్రమంలో నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.ఆన్ లైన్ లోనూ నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది.
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ ఈనెల 10 కాగా ఈనెల 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ.
కాగా నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.కాగా ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను వేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.
ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారని తెలుస్తోంది.