కేసీఆర్ ముందస్తు వ్యూహం..అసలు సీక్రెట్ ఇదేనా..?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు అంశం దేశాన్ని ఒక్క సారిగా ఒక కుదుపు కుదిపేసింది.ఏపీలో నిన్నా మొన్నటి వరకూ ముందస్తు గురించి చర్చలు జరిగాయి కానీ అనుకూని విధంగా ఊహలకి అందని విధంగా కేసీఆర్ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు బహుశా పార్టీలో సీనియర్స్ కి సైతం ఈ విషయంపై సమాచారం లేదనే చెప్పాలి అయితే కేసీఆర్ నిర్ణయం వెనుక అసలు మర్మం ఏమిటి.? ముందస్తు కి కేసీఆర్ ఎందుకు కాలు దువ్వాడు.? ఈ డెసిషన్ వెనుక అసలు యాక్షన్ ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే.

 Telangana Assembly Dissolution Secret Behind Kcr Daring Decision-TeluguStop.com

నేను ఎన్నికలకి సిద్దంగా ఉన్నాను మరి మీరు సిద్దమేనా అంటూ కేసీఆర్ కాంగ్రెస్ కి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకి కేసీఆర్ సవాల్ విసిరారు.ఇంతటి అధికారాన్ని ఇంకా తొమ్మిది నెలలు ఉన్న అధికారాన్ని వద్దనుకుని కేసీఆర్ రణరంగం లోకి దూకేశాడు.అంతేకాదు ప్రతిపక్షాలు కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచీ కోలుకోకుండానే మరొక షాక్ వెనువెంటనే ఇచ్చేశాడు ఏకంగా మొదటి విడతగా దాదాపు 105 మంది అభ్యర్ధుల లిస్టు ని డిక్లర్ చేసి చెప్పేసరికి ప్రతిపక్ష నేతలకి మాత్రమె కాదు సొంత పార్టీ నేతలకే దిమ్మరితిగిపోయింది.దాంతో అందరూ షాక్ లో ఉండిపోయారు…సరే అసలు కేసీఆర్ వ్యూహంలో మర్మం ఏమిటి అంటే.

కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో దూసుకుని రావాలని చూస్తున్నాడు.ఎలాగో తనయుడు కేటీఆర్ ని ముందు నుంచీ సిద్దం చేస్తూ వచ్చాడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తే లోక్ సభ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి అధికారంలో ఉంటే దూకుడు చూపించి అందులో హవా చూపించాలని.మెరుగైన సంఖ్యలో సీట్లు సాధించగలిగితే కేంద్రంలో ఏర్పడబోయే పరిస్థితులను బట్టి కీలక పాత్ర పోషించవచ్చని ఒక అంచనాగా కనిపిస్తున్నది.

కేటిఆర్ గతంలోనే 17 లోక్ సభ సీట్లలో 16 సాధిస్తామని ధీమాగా ప్రకటనలు ఇస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

అటు కాంగ్రెస్ కూడా సమావేశాల్లో సమాలోచనల్లో మునిగితేలుతున్నది.అంతేకాదు కెసేఆ పెట్టిన రైతు భందు పధంకం అదేవిధంగా మిషన్ భగీరధ లాంటివి ఎన్నో ఎన్నెన్నో పధకాల వలన కేసీఆర్ తెలంగాణ ప్రజల మనస్సులలో ముఖ్యంగా రైతులలో చెరగని ముద్ర వేసుకున్నాడు…అయితే ఈ వేడి ఇలానే ఉండాలి అంటే ప్రజల మనసులో మరో ఆలోచన వచ్చే లోగా ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విరుచుకుని పడేలోగా ఎన్నికలు వస్తేనే మేలు జరుగుతుందని గ్రహించిన కేసేఆర్ అందుకు తగ్గట్టుగా ఊహించని విధంగా ఈ ముందస్తుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోంది.

ఏది ఏమైనా సరే కేసీఆర్ తీసుకున్న ముందస్తు నిర్ణయం.అభ్యర్ధుల ఖరారు రెండూ కూడా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి చుక్కలు కనిపించేలా చేశాయి అనడంలో సందేహం లేదని చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube