థియేటర్ల రీ ఓపెన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వ ఏం చెబుతోంది?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను ఎత్తి వేసింది.దాంతో షూటింగ్‌ లను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Telangana And Ap Theaters Re Open In Next Month-TeluguStop.com

ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్‌ లు ప్రారంభం అవ్వగా జులై నుండి పూర్తి స్థాయిలో షూటింగ్‌ లు జరుగబోతున్నాయి.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

షూటింగ్‌ లు అయితే జరుగబోతున్నాయి.మరి థియేటర్ల పరిస్థితి ఏంటీ అనేది మాత్రం తెలియడం లేదు.

 Telangana And Ap Theaters Re Open In Next Month-థియేటర్ల రీ ఓపెన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి థియేటర్ల విషయంలో వచ్చిన గైడ్‌ లైన్స్‌ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.థియేటర్ల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.

కనుక ఏ సమయంలో అయినా థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు అవకాశం ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తాజాగా ప్రముఖ నిర్మాత ఒకరు మాట్లడిన దాన్ని బట్టి చూస్తుంటే జులై లో థియేటర్లు పునః ప్రారంభం కాబోతున్నాయి.

కొన్ని రోజుల పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్లు రన్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా థియేటర్ల విషయమై ఏపీ ప్రభుత్వం నుండి కూడ స్పష్టత రావాల్సి ఉంది.తెలుగు సినిమా లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల అవ్వాల్సి ఉంటుంది.

కనుక థియేటర్లలో విడుదల చేయాలంటే రెండు రాష్ట్రాలు కూడా థియేటర్ల పై ఉన్న ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేయడంతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీ విషయంలో క్లారిటీ ఇవ్వాలి.థియేటర్ల రీ ఓపెన్‌ విషయంలో జరుగుతున్న చర్చకు ఏపీలో క్లారిటీ రావాలంటే మరో వారం పది రోజుల సమయం పడుతుందని అంటున్నారు.ఇక తెలంగాణలో మాత్రం థియేటర్ల విషయం పై స్పష్టత ఉంది.అక్కడ ఇక్కడ కనెక్షన్‌ ఉంది కనుక ఫిల్మ్‌ మేకర్స్‌ షూటింగ్స్‌ మాత్రం మొదలు పెట్టి థియేటర్ల విడుదల విషయమై వచ్చే నెలకు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

#TelanganaLock #FilmNews #Lock Down #Reopen #Theaters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు