అమెరికాలో తెలంగాణా యువతి ఆత్మహత్య..!!!  

Telangana America Girl Suicide-girl,husband,mahabubabad District,marriage,nri,sandhya,suicide,telangana

ఎన్నారై సంభంధం అనగానే తమ కూతురు సుఖపడుతుంది, దేశం కాని దేశం లో ఉన్నా సరే భర్త అండగా ఉంటాడని భావించి ఎన్నో లక్షలు కట్నాలు ఇచ్చి మరీ పెళ్ళిళ్ళు చేస్తారు ఆడపిల్ల తల్లితండ్రులు. కానీ చాలా మంది ఎన్నారై భర్తలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిన తరువాత అసలు స్వరూపం భయటపెట్టి భార్యలని ఇబ్బందులకి గురిచేస్తున్న సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎంతో మంది ఆ భాదని భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి..

అమెరికాలో తెలంగాణా యువతి ఆత్మహత్య..!!!-Telangana America Girl Suicide

ఇలాంటి సంఘటనే మళ్ళీ అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన సంధ్య అనే యువతికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణా వాసితో పెళ్లి అయ్యింది.

ఆమె ఎన్నో ఆశలతో భర్త తో పాటు అమెరికా వెళ్ళింది. కొంతకాలం సజావుగానే ఉన్నా చిన్న చిన్న విషయాలకే కోప్పడటం, చేయి చేసుకోవడం మొదలెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేక తల్లి తండ్రులకి చెప్తే.

చెప్పిన కారణంకి కూడా ఆమెని వేధించే వాడు ఆమె భర్త .రోజు కొట్టం, చిత్ర హింసలు పెట్టడం తట్టుకోలేని ఆమె ఈ సమస్యకి పరిష్కారం చావే అని నిర్దారించుకుంది.

చివరికి ఆత్మ హత్య చేసుకుని తనువు చాలించింది. దాంతో తమ అల్లుడి కారణంగానే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.