క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ మొగ్గు ! ఎవరెవరికి స్థానం అంటే ?  

Kcr Wants To Extend Telangana Cabinet In Soon -

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా అకస్మాత్తుగానే చేస్తారు.రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నట్టుగా ఉంటారు.

Kcr Wants To Extend Telangana Cabinet In Soon

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొన్ని నెలలే గడుస్తోంది.అయితే అప్పుడే ప్రభుత్వం మీద ఎక్కడలేని వ్యతిరేఖత క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది.

ఒక వైపు బీజేపీ చూస్తే టీఆర్ఎస్ పార్టీని ఎలా దెబ్బతీయాలా అంటూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తోంది.మరో వైపు దూసుకువస్తున్న మున్సిపల్ ఎన్నికలు ఇలా అన్ని వైపుల నుంచి టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుండడంతో సందిగ్ధంలో పడిపోయింది.

క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ మొగ్గు ఎవరెవరికి స్థానం అంటే -Political-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే తమ వైపు నుంచి ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటున్నాడు కేసీఆర్.దీనిలో భాగంగానే త్వరలో తన క్యాబినెట్ ను విస్తరించాలని చూస్తున్నాడు.

ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగుతుందని, దేశమే మన దగ్గర నేర్చుకునేలా భారీ సంస్కరణలు చేయబోతున్నట్టు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.అంతే కాదు మున్సిపల్ ఎన్నికల అనంతరం కేసీఆర్ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు కూడా లీకులు ఇస్తున్నాడు.దీనిలో భాగంగానే కొత్త మంత్రుల పేర్లను కూడా ఖాయం చేసుకున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ కేబినెట్ లో బలమైన కమ్మ సామాజికవర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, ప్రజల్లో మద్దతు, ప్రతిపక్షాలను దైర్యంగా ఎదుర్కునే వారికి తన క్యాబినెట్ లో స్థానం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారిని సంతృప్తి పరిచేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీ రోల్ పోషించే నిమిత్తం కమ్మ సామజిక వర్గం నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం కేసీఆర్ కు ఆహ్యావసరంగాగా మారింది.ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన పువ్వాడ అజయ్, ఓడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులలో ఒకరికి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడట.అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో విలీనమైన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నాడట.వీరితోపాటు ఒక ఎస్టీ, ముదిరాజ్ కోటాలో జోగు రామన్న, గంగుల కమలాకర్ మాదిగ, అలాగే రసమయి బాలకిషన్ కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నట్టు టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు