ఆర్జీవీ సినిమాలో నటించడం వలన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత తన గ్లామర్ తో హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిన తెలుగు బ్యూటీ తేజస్వీ మదివాడ.ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన గ్లామర్ ఫోటో షూట్ లతో ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు సందడి చేస్తుంది.

 Tejaswi Madivada Said Her Love Breakup Reason, Tollywood, Telugu Cinema, South C-TeluguStop.com

దీంతో ఈమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు ఎక్కువగా ఉంటారు.ముంబై భామల రేంజ్ లో అందాల ప్రదర్శన చేసిన, హాట్ సన్నివేశాలలో నటించడానికి ఒకే చెప్పిన కూడా తెలుగు సినిమాలలో తనలాంటి తెలుగమ్మాయిలకి అవకాశాలు రావడం గగనం అయిపోతుందని తేజస్వీ మాదివాడ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.

కేవలం ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ మీద అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయని, నార్త్ అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉండటం వలన వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటున్నారని, తెలుగు అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేకపోవడమే అవకాశాలు ఇవ్వడం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఈమె నటించిన కమిట్మెంట్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Telugu Telugu, Tollywood-Latest News - Telugu

ఈ సందర్భంగా తేజస్వీ తన మనసులో అభిప్రాయాలని బయట పెట్టింది.తెలుగమ్మాయిలు అంటే కమిట్మెంట్ అడగడం ఇండస్ట్రీలో అలవాటుగా మారిపోయిందని పేర్కొంది.నేను అలాంటి వాటికి దూరంగా ఉండటం వలన టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపింది.తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటే అలాంటి పనులు చేసి ఉంటానని అనుమానం పెంచుకున్నాడని తెలిపింది.

తరువాత ఆర్జీవీ సినిమాలో నటించావంటే అలాంటి పనులు చేయలేదంటే ఎలా నమ్మాలి అని అంటూ తనని దూరం పెట్టాడని అలా ఈ సినిమాల కారణంగా తనకి బ్రేక్ అప్ అయ్యిందని చెప్పింది.ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దర్శక, నిర్మాతల కోరిక తీర్చాలనే అభిప్రాయం చాలా మందిలో ఉందని, అలాంటి అనుభవం తనకి కూడా ఎదురైనా తర్వాత అది వాస్తవం అనే విషయం తెలిసింది అని తేజస్వీ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube