మళ్లీ అనుమానం.. తేజస్వి విషయంలో కూడా అదే జరిగిందా?   Tejaswi Madivada Out From Bigg Boss Show     2018-07-23   09:44:49  IST  Ramesh P

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ఎలిమినేషన్‌ విషయంలో మొదటి నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి సీజన్‌లో కూడా ఎలిమినేషన్‌ విషయంలో అనుమానాలు ఉన్నప్పటికి అవి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈసారి మాత్రం ఎలిమినేషన్‌ విషయంలో ప్రతి రోజు చర్చ జరుగుతుంది. ప్రేక్షకుల ఓటింగ్‌ సక్రమంగా జరుగుతుందా, ఓటింగ్‌ ఆధారంగానే ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటింగ్‌ సక్రమంగా జరిగితే మరి సెలబ్రెటీలుగా మంచి గుర్తింపు ఉన్న వారు ఎలా ఎలిమినేట్‌ అవుతారు అంటూ కొందరు అనుమానిస్తున్నారు.

ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్న అయిదుగురు సామ్రాట్‌, తేజస్వి, దీప్తి, తనీష్‌, రోల్‌రైడా. ఈ అయిదుగురిలో మొదట అంతా కూడా టీవీ9 దీప్తి ఎలిమినేషన్‌ ఖాయం అని భావించారు. కాని అనూహ్యంగా దీప్తి శనివారం రోజే సేఫ్‌జోన్‌లోకి వెళ్లి పోయింది. ఇక దీప్తితో పాటు రోల్‌రైడా మరియు తనీష్‌లు కూడా ఎలిమినేషన్‌లోంచి సేఫ్‌ అయ్యారు. శనివారంకు సామ్రాట్‌ మరియు తేజస్వి మిగిలి పోయారు. వీరిద్దరిలో ఎవరు ఇంటి నుండి వెళ్లి పోతారు అనే చర్చ జరిగినప్పుడు అంతా కూడా సామ్రాట్‌ వెళ్తాడు అంటూ భావించారు. కాని అనూహ్యంగా తేజస్వి ఇంటి నుండి బయటకు వచ్చేయడం షాకింగ్‌గా ఉంది.

తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తేజస్వి, ఇంట్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వారిలో అత్యధిక క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పార్టిసిపెంట్‌ అంటే ఠక్కున తేజస్వి పేరు వినిపిస్తుంది. అలాంటి తేజస్వి పరిస్థితి ఇలా ఎందుకు అయ్యిందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్‌ అనుకున్న వారిని ఎలిమినేషన్‌ ద్వారా బయటకు పంపిచేస్తున్నారు. ఓటింగ్‌ పద్దతి సరిగా జరిగితే ఖచ్చితంగా టీవీ9 దీప్తి కంటే తేజస్వికి ఓట్లు ఎక్కువగా పడతాయి. కాని ఏదో మతలబు జరుగుతుంది. ఎందుకో తేజస్వికి ఓట్లు పడలేదు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి ప్రతి వారం కూడా ఎలిమినేషన్‌ చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది.

గత వారం కూడా భానుశ్రీ, అంతుకు ముందు వారం శ్యామల ఎలిమినేషన్‌ అవ్వాల్సిన వారే కాదు. అయినా కూడా బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యారు. తేజస్వి బిగ్‌బాస్‌లో కనీసం ఫైనల్‌ వరకు ఉంటుందని లేదంటే పది వారాల పాటైనా ఇంట్లో కొనసాగుతుందని భావించారు. కాని అనూహ్యంగా బిగ్‌బాస్‌ ఇంట్లోంచి తేజస్వి వచ్చేసింది. తేజూ రావడంతో ఇంట్లో సామ్రాట్‌ ఒంటరి అయ్యాడు. షో ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే ఇద్దరి మద్య ప్రేమ చిగురించిన విషయం తెల్సిందే. సామ్రాట్‌ కూడా బయటకు వచ్చిన తర్వాత వీరి భవిష్యత్తు ప్లానింగ్‌ ఉండబోతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.