తేజస్విను రిస్క్‌లోకి నెట్టిన నాని?       2018-07-08   00:20:28  IST  Raghu V

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా టీఆర్పీ రేటింగ్‌ పెంచుకుంటూ దూసుకు పోతుంది. మొదటి రెండు వారాలు నిద్రపోయినట్లుగా సాగిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఇప్పుడు భారీ రెస్పాన్స్‌తో దూసుకు పోతుంది. మొదటి వారం నుండి తన హోస్టింగ్‌ను మెరుగుపర్చుకుంటూ వస్తున్న నాని తాజాగా నాల్గవ వారంలో మరింత ఉత్సాహంతో, ప్రతిభతో దూసుకు పోతున్నాడు. ఇక ఈ వారంలో ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడు అంటూ మొదటి నుండి ప్రచారం జరిగిన గణేష్‌ అనూహ్యంగా సేఫ్‌ అయ్యాడు. గణేష్‌ మరియు గీతామాధురిలు సేప్‌ అవ్వడంతో మిగిలిన ఆరుగురిలో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తుంది.

ఇక తేజస్విని ఎక్కువగా టార్గెట్‌ చేసి నాని తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మనిషి ముందు ఒకరకంగా వెనుక మరోరకంగా తేజస్వి మాట్లాడుతుందని సాక్షాధారాలతో సహా చూపించి షాక్‌ ఇచ్చాడు. నాని మాటలకు తేజస్వి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సామ్రాట్‌ విషయంలో కూడా తేజస్వి కాస్త అతి చేసిందనే విషయంలో చర్చ జరుగుతుంది. గత కొన్నాళ్లుగా తేజస్వి సైలెంట్‌గా ఉంటుందని, మునుపటిలాగా ఉండటం లేదు అంటూ నాని చెప్పుకొచ్చాడు. నాని ఏ మాట మాట్లాడినా కూడా ఖచ్చితంగా మా మాటల ప్రభావం ప్రేక్షకులపై పడుతుంది. ఇప్పుడు అదే విధంగా తేజస్విపై నాని చేసిన వ్యాఖ్యలు ప్రభావంను చూపిస్తాయనే నమ్మకం కలుగుతుంది.

నాని గతంలో కిరీటిని, అంతకు ముందు నూతన్‌ నాయుడును టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేశాడు. దాంతో వారిద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. వారిద్దరు చేసిన తప్పులను నాని సాక్ష్యాధారాలతో ఎత్తి చూపాడు. అందుకే వారిద్దరు ఎలిమినేట్‌ అయ్యారు అంటూ అంతా భావిస్తున్నారు.

ఈ సమయంలోనే నాని తాజాగా తేజస్వి ని టార్గెట్‌ చేయడంతో అంతా కూడా ఇప్పుడు ఆమెపై దృష్టి పెడుతున్నారు. ఒకవేళ వచ్చే వారం తేజస్వి ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉంటే ఖచ్చితంగా ఆమెకు కఠినంగా ఫలితం రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే వారు ఎవరై ఉంటారా అని అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు అనేది తేలిపోయే అవకాశం ఉంది.