ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన తేజస్వి.. అచ్చం అలా ఉన్నావంటూ కామెంట్స్?

కొంతమంది ఆర్టిస్టులను నెటిజన్స్ బాగా ఆడుకుంటూ ఉంటారు.సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

 Tejaswi Appeared In A Traditional Look Are The Comments Like That Tejaswi, Tradi-TeluguStop.com

ఇక లేడీ ఆర్టిస్టులను మాత్రం ఓ రేంజ్ లో ఏకీపారేస్తూ ఉంటారు.వాళ్ళు ఎంత అందంగా రెడీ అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు.

ఇప్పటికే ట్రోలర్స్  చేతిలో ఎంతోమంది లేడీ ఆర్టిస్టులు బుక్ అయ్యారు.అందులో ఒకరు తేజస్వి మదివాడ అని కూడా చెప్పాలి.

ఇక ఈమె ఏం చేసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారు.తాజాగా కూడా ఈమె పై ట్రోల్స్ చేశారు నెటిజన్స్.

ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుంది.తొలిసారిగా తేజస్వి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో కూడా నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్  విషయంలో డోస్ పెంచగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తేజస్వి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

తేజస్వి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ హీరోయిన్ లా తయారవుతూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఇట్టాగే పడేస్తుంది.

అప్పుడప్పుడు లైవ్ కాల్స్ ద్వారా కూడా బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తను బుల్లితెరపై బిబి జోడీలో అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తన డాన్స్ తో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఫిదా చేస్తుంది.ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది తేజస్వి.అందులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా తన ఫోటోని చూసి అందరూ అచ్చం చంద్రముఖి లాగా ఉన్నావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మరికొంతమంది మాత్రం నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.

https://instagram.com/stories/tejaswimadivada/3019290969607906620?igshid=NjcyZGVjMzk=

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube