దర్శకుడు తేజ అడల్ట్‌ మూవీ కంప్లీట్‌  

Director Teja Adult Movie Complete, Teja, Webseries, Adult Content, Love Stories, Digital Theaters - Telugu Adult Content, Digital Theaters, Love Stories, Teja, Webseries

న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు తేజ ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రాలను చేశాడు.అద్బుతమైన కథ మరియు కథనాలను ఏమీ లేకుండానే సింపుల్‌ కథలను ప్రేక్షకులకు అర్థం అయ్యే కథనంతో ప్రజెండ్‌ చేయడం వల్ల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈయన ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

TeluguStop.com - Teja Webseries Adult Content Love Stories Digital Theaters

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఒక్క హిట్‌ రెండు ఫట్‌ అన్నట్లుగా కెరీర్‌ సాగుతోంది.ఇలాంటి సమయంలో ఈయన ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ విషయమై ఆయన శిష్యుల నుండి పూర్తి క్లారిటీ వచ్చేసింది.

తేజ నుండి వస్తున్నది వెబ్‌ సిరీస్‌ కాదట ఒక వెబ్‌ మూవీగా వారు పేర్కొన్నారు.

దానికి కూడా తేజ దర్శకత్వం వహించలేదు ఆయన సహాయ దర్శకుడు అయినా ఒక యంగ్‌ డైరెక్టర్‌తో చేయించాడట.ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలను వారు చెబుతు నిజాం కాలం నాటి ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించారు.

కథను తేజ అందించాడు.విభిన్నమైన కథనంతో చాలా చక్కని భావోద్వేగతంతో సినిమాను రూపొందించారంటూ సమాచారం అందుతోంది.

కథానుసారం కాస్త బోల్డ్‌ కంటెంట్‌ అధికంగానే జొప్పించారంటూ సమాచారం అందుతోంది.నందిని రాయ్‌ కీలక పాత్రలో కనిపించిన ఈ వెబ్‌ మూవీ నిడివి దాదాపుగా గంట ఉంటుందట.

దీనికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేస్తారట.గంట నిడివి ఉన్న సినిమా ఏంటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు తేజ కూడా వర్మను ఫాలో అవుతున్నాడేమో అంటున్నారు.గంట నిడివి ఉన్న సినిమా తన సొంత డిజిటల్‌ థియేటర్‌లో తేజ విడుదల చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

#Adult Content #Love Stories #Teja #Webseries

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teja Webseries Adult Content Love Stories Digital Theaters Related Telugu News,Photos/Pics,Images..