తేజా గారు రెంటిలో ఒక్కటైనా వచ్చేనా?  

Teja Waiting For Gopichandh And Rana Confirmation Telugustop - Telugu Alimelumanga Venkataramana, Gopichandh Villan Role In Rajinikanth Movie, Rakshasha Raju Ravanudu, Teja, Teja And Gopichand, Teja And Rana

దర్శకుడు తేజ మొన్న ఆయన బర్త్‌డే సందర్బంగా ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ రెండు సినిమాలను కూడా ఇదే ఏడాదిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ ప్రకటించాడు.

 Teja Waiting For Gopichandh And Rana Confirmation Telugustop

టైటిల్స్‌ను ప్రకటించిన దర్శకుడు హీరోల విషయంలో మాత్రం కన్ఫ్యూజన్‌లో ఉంచాడు.రాక్షస రాజు రావణుడు చిత్రానికి హీరో రానా అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఆయన కథకు ఓకే చెప్పలేదని సమాచారం అందుతోంది.

తేజా గారు రెంటిలో ఒక్కటైనా వచ్చేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక మీడియా సంస్థతో రానా మాట్లాడుతూ రాక్షస రాజు రావణుడు ఎప్పుడు అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు.కథ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి అన్నాడు.అలాగే అసలు తేజ దర్శకత్వంలో సినిమా ఉంటుందో లేదో అన్నట్లుగా మాట్లాడాడు.

అలా రాక్షస రాజు రావణుడు సినిమా ఉందో లేదో తెలియని పరిస్థితి.

ఇక అలిమేలుమంగ వెంటకరమణ చిత్రంలో గోపీచంద్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమా విషయంలో కూడా గోపీచంద్‌ క్లారిటీ ఇవ్వడం లేదు.ఇటీవలే తమిళంలో రజినీకాంత్‌ మూవీలో విలన్‌ పాత్రకు ఎంపిక అయిన గోపీచంద్‌ తేజ దర్శకత్వంలో సినిమా విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ విషయంలో తేజా క్లారిటీ ఇవ్వాలని, కనీసం ఒక్క సినిమా అయినా వచ్చేనా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు