వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన నటి ప్రియా ప్రకాష్ వారియర్.ఈ భామ ఒకే ఒక్క వీడియో క్లిప్ తో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపొయింది.
ఆ ఫేంతో వరుసగా యాడ్స్ చేసే అవకాశాలు సొంతం చేసుకుంది.ఇక సినిమాల పరంగా ఆమె మొదటి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఇక రెండో సినిమాని హిందీలో శ్రీదేవి బంగ్లా అంటూ చేసింది.అయితే ఈ సినిమాపై బోనీ కపూర్ కేసు వేయడం వలన అది పెండింగ్ లో ఉండిపోయింది.
ఇక తెలుగులోకి తెరంగేట్రం చేసి నితిన్ కి జోడీగా చెక్ సినిమా చేసింది.అయితే ఈ సినిమా కూడా అమ్మదికి అదృష్టాన్ని తీసుకురాలేదు.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పాటు ప్రియా ప్రకాష్ పాత్ర కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇష్క్ అనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా తెలుగులో ప్రేక్షకుల ముందుకి ఈ అమ్మడు వస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అతనికి జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుంది.
ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇన్ని రోజులు పెద్దగా ప్రచారంలో లేని ఈ సినిమా రిలీజ్ డేట్ ని సడెన్ గా చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేసేశారు.
ఏప్రిల్ 23న సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తూ ఉండటం కొంత హైప్ ఉంది.
అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా చేస్తున్న రెండో తెలుగు సినిమా కావడం కూడా సినిమాకి కొంత క్రేజ్ ఉంది.యస్.యస్.రాజు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం.మరి ఈ సినిమా వింక్ బ్యూటీకి ఎంత వరకు క్రేజ్ తీసుకొస్తుందో అనేది వేచి చూడాలి.