బుల్లి ఇంద్రసేనుడికి ఓ మంచి సినిమా పడింది.. ఇక భయం లేదు

నేనున్నాను నాయనమ్మ అంటూ ఇంద్ర సినిమా లో డైలాగ్‌ చెప్పి ఇరవై ఏళ్లు అయినా కూడా మర్చి పోకుండా చేసిన బుడ్డోడు తేజ సజ్జ.ఇప్పుడు ఈయన బుడ్డోడు కాదు లేండి.

 Teja Sajja New Movie Pan India Super Hero Movie , Flim News, Hanuman, Hanumanthu, Super Hero Mvoie, Teja Sajja-TeluguStop.com

బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తన్నేంత పెద్దోడు అయ్యాడు.బాల నటుడిగా సినిమాలు చేసిన వారు హీరోలుగా సక్సెస్ అవ్వడం టాలీవుడ్‌ లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

మహేష్ బాబు తర్వాత ఆస్థాయి లో బాల నటుడులు ఎవరు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.కాని ఇప్పుడు తేజ సజ్జ ఆ స్థాయి లో హీరోగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆయన ఓ బేబీ సినిమా లో సమంత మనవడి గా కీలక పాత్రలో కనిపించాడు.ఆ తర్వాత నుండి రెగ్యులర్ కమర్షియల్‌ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు చేస్తున్న తేజ సజ్జ ముందు ముందు మరన్ని సినిమా లు చేయడం ఖాయం గా కనిపిస్తుంది.ప్రస్తుతం ఈయన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా ను చేస్తున్నాడు.

Telugu Hanuman, Hanumanthu, Teja Sajja-Movie

హనుమంతు పాత్రలో తేజ కనిపించబోతున్నాడు.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు.మొట్ట మొదటి సూపర్‌ హీరో పాన్‌ ఇండియా మూవీ అంటూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జ పాత్ర ను ఇండియన్ స్క్రీన్‌ పై ఇంతవరకు చూడలేదు అంటున్నారు.

అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా తేజ సజ్జ ఒక భారీ కుంభ స్థలం కొట్టినట్లే అనడంలో సందేహం లేదు.ఎందుకంటే భారీ ఎత్తున అంచనాలున్న హనుమాన్ సినిమా కనుక విజయం సాధిస్తే ఇక రాబోయే పదేళ్ల వరకు ఆయన కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు.

ఎందుకంటే వరుసగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు వస్తాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక బుల్లి ఇంద్ర సేనుడికి ఒక మంచి సినిమా పడింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube