Teja Sajja Hanuman Movie : హనుమాన్ సినిమాకి జరుగుతున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ మైండ్ పోగొడుతుంది

తేజ సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న హనుమాన్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే సంవత్సరం సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

 Teja Sajja Hanuman Movie Pre Release Business , Teja Sajja Hanuman Movie ,teja-TeluguStop.com

తాజాగా సినిమా యొక్క టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్ చూసిన తర్వాత సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయం లో సినిమా యొక్క విడుదల తేదీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు, కానీ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాత్రం ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.కార్తికేయ 2 సినిమా హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అలాగే కాంతారా సినిమా కూడా హిందీ లో 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Hanuman, Prashant Verma, Teja Sajja-Movie

కనుక హనుమాన్ సినిమా విషయం లో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దని ఉద్దేశం తో హిందీ ఫిలిం మేకర్స్ ఏకంగా 15 నుండి 20 కోట్ల రూపాయల మొత్తము చిత్ర నిర్మాత లకు ఆఫర్ చేశారు అంటూ సమాచారం అందుతుంది.హనుమాన్ మొత్తం బడ్జెట్ కూడా పాతిక కోట్ల రూపాయలకు తక్కువే.ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కే ఏకంగా ఇంత భారీ మొత్తం లో రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ సినిమా కు అన్ని భాషల్లో కలిపి ఏకంగా థియేటర్ రైట్స్ ద్వారానే దాదాపుగా 80 నుండి 90 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.సినిమా సక్సెస్ అయితే ఈజీ గా 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అవుతాయని సమాచారం అందుతోంది.

 హనుమాన్ సినిమా లో అమృత అయ్యర్‌ హీరోయిన్‌ గా నటించింది.వరలక్ష్మి శరత్‌ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube