హనుమాన్ తర్వాత జూనియర్ ఇంద్రసేనా రెడ్డి పాన్ ఇండియా స్టార్‌

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన సూపర్ హిట్ చిత్రం ఇంద్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆ సినిమాలో చిరంజీవి పాత్ర మాత్రమే కాకుండా ఇంద్రసేనా రెడ్డి( Indrasena Reddy ) చిన్నప్పటి పాత్రలో కనిపించిన తేజ అందరికీ సుపరిచితుడు.

 Teja Sajja Hanuman Movie Going To Release Pan India , Prashanth Verma, Teja Sajj-TeluguStop.com

అంతకు ముందు కూడా తేజ ఎన్నో సినిమాల్లో నటించాడు.భలే ఉన్నాడే అంటూ అందరితో ప్రశంసలు దక్కించుకుంటూ చాలా సినిమాల్లో నటించాడు.

ఆ సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.ఆ బుడతాడు ఇప్పుడు పెద్దోడయ్యాడు.

వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

Telugu Hanuman, Prashanth Varma, Teja Sajja-Movie

అతి తక్కువ సమయం లోనే ఒక అద్భుతమైన సినిమా ను చేసేందుకు తేజా సజ్జా( Teja Sajja ) కి ఛాన్స్ లభించింది.భారీ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో హను మాన్ అనే సినిమా ను తేజా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది.

టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ద తీసుకోవడం జరిగింది.రూ.1000 కోట్ల సినిమా అని.పాన్ వరల్డ్ మూవీ అంటూ ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

దాంతో ఈ సినిమా ను ఆ స్థాయిలోనే రూపొందించాలని ఉద్దేశంతో దర్శకుడు కాస్త సమయం తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాడు.

Telugu Hanuman, Prashanth Varma, Teja Sajja-Movie

హను మాన్( Hanuman ) నుండి వస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.హను మాన్ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా దర్శకుడు ప్రశాంత్ వర్మకి ( Prashanth Verma )పాన్ ఇండియా దర్శకుడు అంటూ పేరు దక్కడంతో పాటు హీరో గా నటిస్తున్న తేజాకి కూడా పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ దక్కుతుంది అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తేజా తక్కువ సమయంలోనే ఇలాంటి ఒక గొప్ప సినిమాలో నటించే అవకాశం తగ్గించుకోవడం అతని అదృష్టం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి తేజా హను మాన్ సినిమా తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube