కరోనా వచ్చిన తేజను ఏకిపారేస్తున్న నెటిజన్స్‌

టాలీవుడ్‌ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.ఈ సమయంలోనే ప్రముఖ దర్శకుడు తేజ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

 Netizens Trolls On Teja, Teja, Nandini Rai, Social Media, Web Series, Coronaviru-TeluguStop.com

ప్రస్తుతం ఈయన రెండు సినిమాలు చేస్తుండటంతో పాటు నందినీ రాయ్‌తో ఒక వెబ్‌ సిరీస్‌ను కూడా తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.బిజీ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఆయనకు కరోనా పాజిటివ్‌ అంటూ రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఒక పాత వీడియోను పట్టుకుని తేజను కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు.

జూన్‌ నెలలో తేజ ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఇండియన్స్‌ మరీ బాధ్యత లేకుండా ఉన్నారు.

వారి యాటిట్యూడ్‌ కారణంగా కోట్లల్లో కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు.నాకేం కాదులే నా వాళ్లకు ఏం కాదు నేను మాట్లాడే వాళ్లు అంతా బాగానే ఉన్నారు అనుకుంటూ ఉండటం వల్ల కరోనా వచ్చే ప్రమాదం ఉందని బాధ్యత లేకుండా ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడటం ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని ఇంట్లోకి వెళ్లి అంతా కంపు చేయడం సరైనది కాదు అంటూ తేజ అన్నాడు.

యాటిట్యూడ్‌ను పక్కన పెట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ వీడియోలో తేజ ఇండియన్స్‌ అందరికి సున్నితంగా మొట్టికాయలు వేసి మరీ సూచనలు చేశాడు.మరి అంతగా సూచనలు చేసిన నీవు ఎందుకు జాగ్రత్తలు పాటించలేదు తేజ గారు అంటు కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మీరు చెప్పిన సూచనలు అన్ని శ్రీరంగ నీతులేనా అంటూ నెటిజన్స్‌ ఆయన్ను ఒక రేంజ్‌లో కుమ్మేస్తున్నారు.మరి తేజకు ఎలా కరోనా వచ్చి ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ఆయన జాగ్రత్తగా ఉండి ఉంటే ఎలాగూ వచ్చి ఉండక పోయేది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube