గోపీచంద్ కోసం లేడీ ఓరియెంటెడ్ టైటిల్  

Teja Gopichand Movie Title Alivelu Venkataramana - Telugu Alivelu Venkataramana, Gopichand, Seetimaar, Teja, Telugu Movie News

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తేజ నేనే రాజు నేనే మంత్రి సక్సెస్‌తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.తేజ డైరెక్షన్‌లో వచ్చిన సీత చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు తేజ.

Teja Gopichand Movie Title Alivelu Venkataramana

మ్యాచో స్టార్ గోపీచంద్‌తో తన నెక్ట్స్ మూవీని ప్లాన్ చేసిన తేజ ఆ సినిమాకు కూడా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.

అటు రానా దగ్గుబాటితో కూడా మరో సినిమాను తేజ ప్లాన్ చేస్తున్నాడట.

ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాలని తేజ ప్రయత్నిస్తున్నాడు.తేజ-రానా కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్‌ను అనుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గోపీచంద్‌తో తీయబోయే సినిమాకు ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు తేజ.మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్‌తో సక్సె్స్ అందుకున్న తేజ మరోసారి అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

గతంలో తేజ డైరెక్ట్ చేసిన జయం, నిజం చిత్రాల్లో గోపీచంద్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాతో గోపీచంద్‌కు తేజ ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

కాగా గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం సీటీమార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

#Seetimaar #Teja #Gopichand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teja Gopichand Movie Title Alivelu Venkataramana Related Telugu News,Photos/Pics,Images..