ఉదయ్‌ కిరణ్‌ రహస్యాలన్నీ తెలుసు వాటితో డబ్బులు సంపాధించాలని లేదంటున్న దర్శకుడు  

Teja Comments On Uday Kiran-

చిత్రం మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఉదయ్‌ కిరణ్‌ను దర్శకుడు తేజ పరిచయం చేశాడు.అదో చిన్న చిత్రం.కాని అప్పట్లో అది బాహుబలి స్థాయి సక్సెస్‌ అని చెప్పుకోవాలి.తెలుగులో అంత చిన్న చిత్రం అంత పెద్ద విజయాన్ని దక్కించుకోవడం అదే ప్రథమం.

Teja Comments On Uday Kiran--Teja Comments On Uday Kiran-

రికార్డులు బద్దలు అయ్యాయి.అద్బుతమైన సినిమా అంటూ అంతా ప్రశంసలు కురిపించారు.ఆ చిత్రంతో ఉదయ్‌ కిరణ్‌ ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు.టాలీవుడ్‌లో అతి తక్కువ స మయంలోనే బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్టార్‌ అయ్యాడు అంటూ అంతా ఉదయ్‌ కిరణ్‌ను నెత్తిన పెట్టుకున్నారు.

Teja Comments On Uday Kiran--Teja Comments On Uday Kiran-

ఉదయ్‌ కిరణ్‌ హీరోగా డౌన్‌ ఫాల్‌ అవుతున్న సమయంలో వ్యక్తిగత విషయాలు కూడా అతడి జీవితాన్ని మరింత నాశనం చేశాయి.చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లింది.ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ను తేజ తీస్తే బాగుంటుందని, రాబోయే కొత్త హీరోలకు ప్రస్తుతం ఉన్న హీరోలకు ఈ చిత్రం చాలా ఉపయోగదాయకం అంటూ అంతా భావించారు.

కాని తేజకు మాత్రం బయోపిక్‌ తీసే ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈ విషయమై మాట్లాడుతూ నాకు ఉదయ్‌ కిరణ్‌ గురించిన ప్రతి విషయం తెలుసు.అతడు ఎదుర్కొన్న సమస్యలు, అతడి జీవితంలో ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు నాతో షేర్‌ చేసుకున్నాడు.కాని నేను ఇప్పుడు వాటిని వెండి తెరపై పెడితే అతడికి ఉపయోగం లేదు.

నేను డబ్బులు సంపాదించడం కోసం అతడి రహస్యాలను బయట పెట్టాలనుకోవడం లేదు అంటూ తేజ చెప్పుకొచ్చాడు.ఉదయ్‌ కిరణ్‌ ఒక మంచి కుర్రాడని మాత్రం తేజ చెప్పడం జరిగింది.