‘చిత్రం’ సీక్వెల్‌ సినిమానా? వెబ్‌ సిరీసా?  

Teja Want Sequel On Chitram Movie For Webseries, Teja, Chitram, OTT, Chitram Sequel, Uday Kiran, - Telugu Chitram, Chitram Sequel, Ott, Teja, Uday Kiran

దర్శకుడు తేజ దర్శకత్వంలో దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘చిత్రం’ సినిమా గుర్తు ఉంది కదా.ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆ సినిమాను దర్శకుడు తేజ కేవలం 30 లక్షల రూపాయలతో పూర్తిగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏమాత్రం భారీతనంకు పోకుండా తెరకెక్కించాడు.

 Teja Chitram Ott Chitram Sequel Uday Kiran

ఈ చిత్రం తేజకు మొదటి సినిమా అవ్వడంతో పాటు ఉదయ్‌ కిరణ్‌కు కూడా మొదటి సినిమా.కోట్ల వసూళ్లు సాధించిన ఆ సినిమాకు ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్‌ను తీయాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడు.

చిత్రం సినిమాలో కాస్త బోల్డ్‌ కంటెంట్‌ ఉంటుంది.అది మాత్రమే కాకుండా కాస్త యూత్‌ సెంట్రిక్‌ గా కూడా సినిమా ఉంటుంది.ఇప్పుడు దానికి సీక్వెల్‌ అంటే మరింత బోల్డ్‌ కంటెంట్‌ను పెట్టాల్సి ఉంటుంది.మరి బోల్డ్‌ కంటెంట్‌ అంటే ఈమద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.

‘చిత్రం’ సీక్వెల్‌ సినిమానా వెబ్‌ సిరీసా-Movie-Telugu Tollywood Photo Image

వెబ్‌ సిరీస్‌ల్లో అయితేనే ఎంత కావాలంటే అంతగా బోల్డ్‌ కంటెంట్‌ను జొప్పించ వచ్చు.

దర్శకుడు తేజ చిత్రంకు సీక్వెల్‌ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సినిమా గా కాకుండా ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌ను చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మరి తేజ నిర్ణయం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఈ సీక్వెల్‌ కోసం ఉదయ్‌ కిరణ్‌ వంటి 20 ఏళ్ల కుర్రాడిని ప్రస్తుతం తేజ వెదుకుతున్నాడట.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#Uday Kiran #Chitram #Chitram Sequel #Teja #OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teja Chitram Ott Chitram Sequel Uday Kiran Related Telugu News,Photos/Pics,Images..