హీరో ఓకే చెప్పకుండానే టైటిల్‌ అనౌన్స్‌ చేశాడా?

దర్శకుడు తేజ ఇటీవల రెండు టైటిల్స్‌ను అనౌన్స్‌ చేసిన విషయం తెల్సిందే.అందులో ఒకటి గోపీచంద్‌ హీరోగా రూపొందించబోతున్నాడు అంటూ క్లారిటీ వచ్చేసింది.

 Teja And Rana Movie Latest News-TeluguStop.com

ఇక రెండవ టైటిల్‌ రానా కోసం రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.రాక్షస రాజు రావణుడు అనే టైటిల్‌తో రానాతో ఒక సినిమాను చేయాలని తేజ భావిస్తున్నాడు.

ఆ విషయమై ఇప్పటికే రానాతో రెండు మూడు సార్లు చర్చలు కూడా జరిగినట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Neneraju, Rana Teja, Rana Latest, Teja-Movie

ఈ సమయంలోనే రానా ఇంకా తేజ చెప్పిన కథకు ఓకే చెప్పలేదని సమాచారం అందుతోంది.రానాకు ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్‌ దృష్ట్యా ఈ ఏడాది చివరి వరకు మరో సినిమా చేసే పరిస్థితి లేదట.అందుకే ఈ సినిమాకు ఇంకా ఓకే చెప్పలేదు అంటూ కొందరు అంటూ ఉంటే తేజ చెప్పిన కథ నచ్చక పోవడం వల్లే ఇప్పటి వరకు తేజకు రానా ఓకే చెప్పలేదు అంటూ మరికొందరు అంటున్నారు.

మొత్తానికి ఏం జరుగుతుందో ఏమో కాని వీరిద్దరి కాంబో మూవీ మాత్రం ఇప్పట్లో సెట్‌ అయ్యేలా కనిపించడం లేదు.

రానా ఓకే చెప్పకుండానే తేజ మాత్రం టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించి పెట్టి సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ నుండి స్పందన ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రానా మాత్రం తాజాగా సన్నిహితుల వద్ద ఇప్పటి వరకు తాను ఆ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పలేదు.

కొన్ని మార్పులు చేర్పులు చెప్పాము.అవి ఇంకా పూర్తి కాకుండానే టైటిల్‌ను అనౌన్స్‌ చేశాడు అంటూ అసహనం వ్యక్తం చేశాడట.

తేజ మళ్లీ స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్‌ ఉంది.లేదంటే సినిమా టైటిల్‌తోనే సరిపెట్టుకోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube