అజిత్ హీరోగా నటించిన తెగింపు మూవీ ఈరోజు రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనా ఈ సినిమాకు బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ 10 శాతం కూడా దాటలేదని తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు టాక్ కూడా ఆశించిన విధంగా లేకపోవడం మైనస్ అవుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెగింపు మూవీ కథ కొత్త కథేం కాదు.యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కగా ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
అజిత్ అభిమానులకు మాత్రం నచ్చే విధంగా ఈ సినిమా ఉంది.అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం ఈ సినిమా ఫెయిలైందని బోగట్టా.ఈ మధ్య కాలంలో వరుసగా యాక్షన్ సినిమాలలో నటిస్తున్న అజిత్ ఈ సినిమా విషయంలో కూడా అదే విధంగా చేశారు.

అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.కథ బాగానే ఉన్నా కథనం ఆసక్తికరంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా నిలిచిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకు దోపిడీలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారసుడు సినిమా కూడా మరీ అద్భుతంగా లేకపోవడం తెగింపుకు ప్లస్ అవుతుంది.తమిళనాట ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.అజిత్ నటన, బీజీఎం, కొన్ని సన్నివేశాలు తెగింపుకు ప్లస్ పాయింట్లు కాగా బోరింగ్ కథ, కథనం, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.







