సాగర్ బరిలో మల్లన్న ? టీఆర్ఎస్ కు మరో టెన్షనే ?

టిఆర్ఎస్ ఏదో ఒక రూపం లో కొత్త టెన్షన్ లు పెరిగిపోతూ వస్తున్నాయి.ఒక పక్క బిజెపి బలం పెంచుకోవడం, మరొక వైపు పార్టీ ప్రభావం తీవ్రంగా ఉండేలా కనిపించడం, ఇంకోవైపు మల్లన్న రూపంలో  కొత్త శత్రువు తెరపైకి రావడం, వీరంతా తమ ని టార్గెట్ చేసుకుంటూ, తమ పరిపాలనను విమర్శిస్తూ రావడం , మరో వైపు ప్రజల్లోనూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలుగా టిఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Teenmar-mallanna-is-planning-to-contest-in-nagarjunasagar-by-election Trs, Bjp,-TeluguStop.com

అయితే తాజగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టిపోటీ ఇవ్వడం టిఆర్ఎస్ కు ఆందోళన పెంచుతుంది.ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో తన ఇమేజ్ మరింత పెరగడంతో, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనతో తీన్మార్ మల్లన్న ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్- నల్గొండ -ఖమ్మం  లో తమ పలుకుబడిని ఉపయోగించుకుని నాగార్జునసాగర్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించాలని తీన్మార్ మల్లన్న డిసైడ్ అయ్యారట.నల్గొండ జిల్లాలో తనకు గట్టి పట్టు ఉందని, తప్పకుండా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉండడం తో టిఆర్ఎస్ మరింత కంగారు పడుతోంది.

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి చెందడం, జీహెచ్ఎంసీ లో  అంతంత మాత్రంగా సక్సెస్ కావడం, ఇప్పుడు కొత్త.శత్రువులు బలపడటం, ఇలా ఎన్నెన్నో కంగారు పుట్టిస్తున్నాయి.

అందుకే కొత్త వ్యక్తుల జోలికి వెళ్లకుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ను బరిలోకి దింపాలి అనే ఆలోచనతో ఉంది.

Telugu @teenmarmallanna, Jana, Mlc, Nagarjuna Sagar, Telangana-Telugu Political

ఇక నల్గొండ జిల్లా లో గట్టి పట్టు ఉన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో మంచి ఓటింగ్ ని సాధించారు.మేధావులు, విద్యావంతులు,  అన్ని వర్గాల ప్రజా మద్దతు కూడగట్టుకుంటూ వస్తుండడంతో, ఆయన కనుక రంగంలోకి దిగితే ఫలితాలు తారుమారు అవుతాయి అనే కంగారు టిఆర్ఎస్ కు ఉంది.ఒక వైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగుతుండడం, ఇంకోవైపు స్వతంత్ర అభ్యర్థిగా మల్లన్న పోటీ చేసే ఆలోచనతో ఉండడంతో ఈ స్థాయిలో టీఆర్ఎస్ టెన్షన్ పడుతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube